ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామాకు కారణమేంటో కేంద్రంలోని మోడీ ప్రభుత్వమే దేశానికి చెప్పాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కొద్ది రోజుల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం షాక్ కు గురి చేసిందని తెలిపారు.
ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి శనివారం అనూహ్యంగా రాజీనామా చేశారు. ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. దీనిపై తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. 2024 లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయడం దిగ్భ్రాంతికరమని ఆయన అన్నారు. ఆయన రాజీనామాకు గల కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని ఒవైసీ డిమాండ్ చేశారు.
బౌద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలి - కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
అరుణ్ గోయల్ తన రాజీనామాకు గల కారణాలను పేర్కొనలేదని, ఈ చర్యకు కారణాలేమిటో మోడీ ప్రభుత్వం దేశానికి చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేశారు. మార్చి 13 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి సమయంలో అరుణ్ గోయల్ రాజీనామా దిగ్భ్రాంతికరమన్నారు.
రాజకీయాల్లోకి భారత మాజీ క్రికెటర్.. టీఎంసీ తరఫున లోక్ సభ బరిలో యూసుఫ్ పఠాన్
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు తీసుకువచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని గుర్తు చేశారు. ప్రధాని, మంత్రి, ప్రతిపక్షనేతలతో కూడిన త్రిసభ్య కమిటీ సీఈసీ, ఈసీలను నియమిస్తుందని ఒవైసీ అన్నారు. కమిటీలో ప్రభుత్వం నుంచి ఇద్దరు సభ్యులుంటే ప్రభుత్వం తనకు నచ్చిన వ్యక్తులను ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తుందని తెలిపారు.
ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ హత్య.. భర్తపై అనుమానం..
సెర్చ్ కమిటీలో కూడా ప్రభుత్వం నుంచి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని ఒవైసీ తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, దీని కోసం తటస్థ వ్యక్తులను నియమించేందుకు సీఈసీ, ఈసీలను నియమించే కమిటీలో ప్రభుత్వానికి మెజారిటీ ఉండకూడదని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొందని అన్నారు.