చైన్ స్నాచింగ్ కేసులో అరెస్ట్ చేస్తే.. బయటపడ్డ నకిలీ కరెన్సీ ముఠా..

Published : Feb 11, 2022, 02:22 PM ISTUpdated : Feb 11, 2022, 02:32 PM IST
చైన్ స్నాచింగ్ కేసులో అరెస్ట్ చేస్తే.. బయటపడ్డ నకిలీ కరెన్సీ ముఠా..

సారాంశం

var url ="https://cdn.jsdelivr.net/gh/unib0ts/unibots@latest/ubPlayer/main/player.min.js"; ubPL = document.createElement("script"); ubPL.src = url; document.getElementsByTagName("head")[0].appendChild(ubPL); window.unibots = window.unibots || { cmd: [] }; unibots.cmd.push(() => { unibotsPlayer("sakshi"); });var url ="https://cdn.jsdelivr.net/gh/unib0ts/unibots@latest/ubPlayer/main/player.min.js"; ubPL = document.createElement("script"); ubPL.src = url; document.getElementsByTagName("head")[0].appendChild(ubPL); window.unibots = window.unibots || { cmd: [] }; unibots.cmd.push(() => { unibotsPlayer("sakshi"); });హైదరాబాద్ లో ఓ నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్ అయ్యింది. చెయిన్ స్నాచింగ్ కేసులో రికవరీకి వెళ్లిన పోలీసులకు అనుకోకుండా.. ఈ ముఠా పట్టుబడింది. దీంతో మొత్తం 11 మంది గ్యాంగ్ లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. 

హైదరాబాద్ :  అద్దెకు ఉంటామని నెపంతో ఇంట్లోకి దూరి మహిళ మెడలోని బంగారు నగలతో ఉడాయిస్తున్న ముగ్గురు 
Interstate gang of thievesను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. Jewelry Recovery నిమిత్తం ప్రధాన సూత్రధారి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా..  40 వేల రూపాయల Counterfeit currency దొరకడంతో..పోలీస్ లకు  అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగు చూసింది.

అలా దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు రాచకొండ పోలీసులు చెక్ పెట్టారు. మొత్తం 11 మంది గ్యాంగ్ లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. గురువారం రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. 

అక్కడ దొరికానని.. ఇక్కడికి వచ్చి... 
తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన కొవ్వూరు శ్రీనివాస్ రెడ్డి గతంలో దొంగనోట్లు ముద్రించి అనపర్తి, రాజమండ్రిలలో చలామణి పనిచేసేవాడు. అదే గ్రామానికి చెందిన ఓగిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి..  దొంగ నోట్లు ఎలా తయారు చేయాలో శ్రీనివాస్రెడ్డి వద్ద నేర్చుకున్నాడు. స్థానికంగా నకిలీ కరెన్సీ నోట్లు వినియోగిస్తూ ప్రజలను మోసం చేసేవాడు. ఈ కేసులో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 

బెయిల్  మీద బయటికి వచ్చాక ఏపీలో ఉంటే మళ్లీ పట్టుబడతానని గ్రహించి ..  తన స్నేహితులైన అనపర్తికి చెందిన కోడూరు శివ గణేష్,  శ్రీకాంత్ రెడ్డి,  కర్రి నాగేంద్ర, సుధామాధవ రెడ్డి, సోరంపూడి శ్రీనివాస్, పిల్లి రామకృష్ణ, పేరం వెంకట శేషయ్య, నాగిరెడ్డి, మస్తాన్ లతో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నాడు.

50,000 ఇస్తే లక్ష…
మియాపూర్లో  ల్వరి టెంపుల్ సమీపంలోని శిల్పా అవెన్యూ కాలనీకి చెందిన తోట సంతోష్ కుమార్ ఇంట్లో దొంగనోట్లు ముద్రించడం మొదలుపెట్టారు. నాగిరెడ్డి, మస్తాన్, శివ గణేష్ లు నకిలీ రూ 100, 200, 300 దొంగనోట్ల తయారీదారులు కాగా..  శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సుధా మాధవరెడ్డి,  శ్రీనివాస్, రామకృష్ణ మధ్యవర్తులు. వీరు రూ.50,000 అసలు నగదు ఇచ్చే వినియోగదారులకు రూ. లక్ష నకిలీ కరెన్సీని ఇస్తుంటారు. ఇందుకుగాను మధ్యవర్తులకు రూ.15,000 కమిషన్ ఇస్తారు. రూ. 35,000 తయారీదారులు తీసుకుంటారు.

విశ్వసనీయ  వర్గాల ద్వారా సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు గురువారం ఉదయం మార్కెట్లో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. తొమ్మిది మందిని అరెస్టు చేశారు. నాగిరెడ్డి, మస్తాన్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ. 3.22 లక్షల నకిలీ కరెన్సీ, 2 కలర్ జిరాక్స్ ప్రింటర్ లు, వాటర్ మార్క్,  ఇతర వస్తువులను స్వాధీనం  చేసుకున్నారు.

జైలులో కలిశారు…
గతంలో గంజాయి కేసులో సంతోష్ కుమార్ అరెస్ట్ కాగా.. మానవ అక్రమ రవాణా కేసులో పేరం వెంకట శేషయ్య అరెస్టయ్యాడు. వీళ్ళిద్దరికీ చర్లపల్లి జైలులో పరిచయం ఏర్పడింది. బెయిల్పై బయటికి వచ్చాక దొంగనోట్ల కేసులో ప్రధాన సూత్రధారి అనపర్తికి చెందిన ఓగిరెడ్డి వెంకట కృష్ణారెడ్డితో జత కట్టారు. మియాపూర్లోని సంతోష్ ఇంట్లో దొంగ నోట్లు ముద్రించి స్థానికంగా చెలామణి చేయడం మొదలుపెట్టారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu