కల్నల్ సంతోష్ బాబు భార్యను సత్కరించిన ఆర్మీ

By Siva KodatiFirst Published Aug 23, 2020, 7:32 PM IST
Highlights

గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు తేజం, కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషిని ఆర్మీ సత్కరించింది. 

గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు తేజం, కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషిని ఆర్మీ సత్కరించింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్థానిక ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్ స్మృతి జోషి ఆమెను సత్కరించారు.

ఆర్మీ అమరవీరుల కుటుంబాలకు సహకారం అందించడంతో పాటు వారి జ్ఞాపకాలను గుర్తు చేసేందుకు గాను ఓ వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. సైనికుల కుటుంబాలకు భరోసాను కల్పించే ఈ కార్యక్రమాన్ని శక్తిగా పిలుస్తారు.

సంతోషి ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ శిక్షణలో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాని ఆమె తెలిపారు. ఎలాంటి బాధ్యతలైనా సరే సేవాభావంతో నిర్వర్తిస్తానని ఆమె చెప్పారు.

భారత్-చైనా సరిహద్దులో ఇటీవల వీరమరణం పొందిన తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు హామీలిచ్చారు.

అందులో భాగంగా అప్పటికప్పుడే సంతోష్ బాబు కుటుంబానికి నగదు సాయం అందించారు. తాజా ఆ కుటుంబానికి హైదరాబాద్ లో ఇస్తామన్న ఇంటి స్థలం హామీని నెరవేర్చే దిశగా అధికారులు వేగంగా పనులు చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని సంతోష్ బాబు కుటుంబానికి కేటాయించింది. 

click me!