టిఆర్ఎస్ కు కాక పుట్టించిన ఆర్మూరు రైతులు (వీడియో)

First Published Feb 15, 2018, 12:44 PM IST
Highlights
  • శాంతియుత దీక్షలకు దిగిన రైతులు
  • సర్కారు దిగొచ్చే వరకు పోరాటం తప్పదిన హెచ్చరిక
  • టిఆర్ఎస్ సర్కారు మాటలకే పరిమితమైందని ఆగ్రహం

 

ఆర్మూరులో అన్నదాత కన్నెర్రజేశాడు. సర్కారు తీరుపై ఆగ్రహంతో రోడ్డెక్కి నిరసన తెలిపాడు. పెద్ద సంఖ్యలో రైతులు శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. ఆర్మూరులోని అంబేద్కర్ చౌరస్తాలో రైతు సంఘాల నేతలు అన్వేష్ రెడ్డి, మంథని నవీన్ తోపాటు రైతులు నిరహారదీక్షకు దిగారు. పార్టీలకు అతీతంగా రైతులు పెద్ద సంఖ్యలో ఈ దీక్షలో పాల్గొన్నారు. టిఆర్ఎస్ సర్కారు తీపి మాటలతో అన్నదాతను మభ్యపెట్టి మోసం చేస్తోందని రైతు సంఘాల నేతలు మండిపడ్డారు. ఎర్రజొన్న రైతులకు న్యాయం చేస్తామన్న మాటలే తప్ప చేతలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల నిరహారదీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర సాధించే వరకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని అనిల్ అన్నారు. రైతులు రోడ్డెక్కుతున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపొవడం సిగ్గుచేటన్నారు. దళారులు సిండికేట్ అయి శ్రీలంక లో జల్సా లు చేస్తుంటే ఆర్మూరు, బాల్కొండ యమ్మెల్యేలు స్పందించకపోవడం దారుణమన్నారు. రైతుల బాధలు మీకు పట్టవా అని ఈరవత్రి అనీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన వీడియో కింద ఉంది చూడండి.

click me!