వనపర్తి జిల్లాలో దారుణం: భూతగాదాలతో భార్యాభర్తలపై కత్తులతో దాడి, తీవ్ర గాయాలు

Published : Jul 08, 2020, 11:59 AM IST
వనపర్తి జిల్లాలో దారుణం: భూతగాదాలతో భార్యాభర్తలపై  కత్తులతో దాడి, తీవ్ర గాయాలు

సారాంశం

 వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట మండలం బుద్దారంలో భూ తగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘటనలో ప్రత్యర్ధులు భార్యాభర్తలపై కత్తులో దాడికి దిగారు.

వనపర్తి: వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట మండలం బుద్దారంలో భూ తగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘటనలో ప్రత్యర్ధులు భార్యాభర్తలపై కత్తులో దాడికి దిగారు. మహిళపై ఓ వ్యక్తి కత్తితో విపరీతంగా దాడికి దిగాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో గాయపడిన దంపతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన తర్వాత హైద్రాబాద్ కు తరలించారు. 

మహిళను ఓ వ్యక్తి కత్తితో దాడి చేస్తున్న సమయంలో స్థానికులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. కానీ, ఈ దారుణాన్ని ఆపేందుకు ఎవరూ కూడ ప్రయత్నించలేదు.   రెండు వర్గాలకు మధ్య భూ వివాదాలు ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. భూ తగాదాల కారణంగానే ఈ దాడి చోటు చేసుకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

బుద్దారం గ్రామానికి చెందిన అర్జునయ్య, అనంతరాములు దాయాదులు. వీరిద్దరి మధ్య 22 గుంటల భూమి విషయంలో 10 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి పొలాలు కూడ పక్క పక్కనే ఉంటాయి. వారం రోజులుగా ఈ భూముల విషయంలో గొడవలు చోటు చేసుకొన్నాయి.

బుధవారం నాడు ఉదయం అర్జునయ్య వర్గీయులు అనంతరాములు కుటుంబంపై దాడికి దిగారు. అర్జునయ్య కొడుకు అనంతరాములుపై దాడి చేశాడు. అర్జునయ్య కత్తితో అనంతరాములు భార్య గొంతుపై నరికాడు. 
 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే