హన్మకొండలో దారుణం: పెళ్లైన నెలకే భర్త గొంతు కోసిన భార్య

By narsimha lode  |  First Published Apr 25, 2022, 3:19 PM IST

హన్మకొండ జిల్లాలో సోమవారం నాడు దారుణం చోటు చేసుకొంది. భర్త గొంతు కోసింది భార్య. అర్చన, రాజుకి నెల రోజుల క్రితమే వివాహమైంది. కొద్ది రోజులుగా అర్చన వింతగా ప్రవర్తిస్తుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. Hanmakonda Crime News


దామెర: హన్మకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో భర్త గొంతు కోసింది భార్య.  బాధితుడిని MGM ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  హన్మకొండ జిల్లా దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన  మాడిశెట్టి Rajuకు Archana తో ఈ ఏడాది మార్చి 25వ తేదీన వివాహమైంది. 

కొన్ని రోజుల పాటు బాగానే ఉన్న అర్చన కొద్ది రోజులుగా వింతగా ప్రవర్తిస్తుందని రాజు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.  ఇవాళ తెల్లవారుజామున నిద్రిస్తున్న రాజు గొంతును Blade తో అర్చన కోసింది. దీంతో తీవ్రంగా గాయపడిన రాజును  కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.  అర్చన ఎందుకు రాజు గొంతు కోసిందనే విషయమై తెలియదని రాజు ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు.

Latest Videos

ఈ నెల 22న ప్రేమోన్మాది  అజహర్  అనూష అనే యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రేమించాలని అనూషపై Azhar అనే యువకుడు కత్తితో  దాడి చేశారు. హన్మకొండలోని పోచమ్మకుంటకు సమీపంలో  ఈ ఘటన చోటు చేసుకొంది. యువతికి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందించారు.. నర్సంపేటకు సమీపంలోని లక్నంపల్లి గ్రామానికి చెందిన అనూష కాకతీయ యూనివర్శిటీలో ఎంసీఏ రెండో సంవత్సరం చదువుతుంది. కొంత కాలంగా అజహర్ ఆమెను ప్రేమిస్తున్నానని వేధింపులకు గురి చేస్తున్నట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

పోచమ్మకుంట సమీపంలో కుటుంబంతో పాటు అనూష నివాసం ఉంటుంది.  ఇంట్లో ఎవరూ లేరనే విషయం తెలుసుకొన్న  అజహర్ యువతి ఇంట్లోకి వెళ్లి తనను ప్రేమించాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తన వెంట తెచ్చుకొన్న కత్తితో అనూష గొంతు కోశాడు. అనూష చనిపోయిందని భావించి అజహర్ అక్కడి నుండి వెళ్లిపోయాడు.ఈ విషయం తెలుసుకొన్న స్థానికులు పేరేంట్స్ కు సమాచారం ఇచ్చారు. ఎంజీఎం  ఆసుపత్రికి తరలించారు.అనూష ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని  వైద్యులు చెప్పారు.  గొంతుకు లోతుగా గాయం కాలేదని చెబుతున్నారు. 

యువతిపై దాడికి దిగిన నిందితుడు అజహర్ ను పోలీసులు శనివారం నాడు  అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చారు. ఈ ఘటనలో కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

.

click me!