హైదరాబాద్ లో భానుడి భగభగలు... జూబ్లీ హిల్స్ లో విద్యుత్ పోల్ పై చెలరేగిన మంటలు

Arun Kumar P   | Asianet News
Published : Apr 25, 2022, 02:19 PM IST
హైదరాబాద్ లో భానుడి భగభగలు... జూబ్లీ హిల్స్ లో విద్యుత్ పోల్ పై చెలరేగిన మంటలు

సారాంశం

ఎండలు ఏ స్థాయిలో మండిపోతున్నాయో తెలియజేసే ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. భానుడి భగభగలకు మంటలు చెలరేగి కేబుల్ వైర్లు కాలిపోయాయి. 

హైదరాబాద్: రోహిణి కార్తె ఎండలకు రోకళ్లు సైతం పగిలిపోతాయని అంటుంటారు. కానీ ఈసారి రోహిణి  కార్తెకు మరో నెలరోజుల సమయమున్న ఎండలు మాత్రం అదేస్థాయిలో మండిపోతున్నారు. ఈ మండుటెండలకు భయపడి ప్రజలు మధ్యాహ్నం సమయంలో రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో అయితే వేసవి తాపం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎండ వేడిమికి కేబుల్ వైర్లు సైతం కాలిపోతున్నాయంటేనే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.  

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కరెంట్ పోల్ కు గజిబిజీగా చుట్టేసి ఉన్న నెట్ వర్క్ కేబుల్స్ కు మంటలు చెలరేగాయి. ఎండవేడికి పోల్ హీటెక్కి కేబుల్ వైర్లకు మంటలు అంటుుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా రోడ్డుపక్కన పోల్ పై మంటలు చెలరేగడంతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది స్థానికులు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసారు. 
 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే