స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ పాసుల జారీ: తెలంగాణ డీజీపీ

Published : May 03, 2020, 03:17 PM ISTUpdated : May 03, 2020, 04:12 PM IST
స్వంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ పాసుల జారీ: తెలంగాణ డీజీపీ

సారాంశం

ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఏదేని కారణాలతో తెలంగాణలోనే ఉండిపోతే వారిని వారి రాష్ట్రాలకు వెళ్లేందుకు పాసులు జారీ చేస్తున్నట్టుగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.


హైదరాబాద్: ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఏదేని కారణాలతో తెలంగాణలోనే ఉండిపోతే వారిని వారి రాష్ట్రాలకు వెళ్లేందుకు పాసులు జారీ చేస్తున్నట్టుగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు డీజీపీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.

విద్య, ఉద్యోగం, ఉపాధితో పాటు ఇతర కారలతో తమ స్వంత ప్రాంతాలకు వెళ్లలేని వారికి ఈ పాస్ విధానం ద్వారా పాసులను జారీ చేయనున్నట్టుగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రకటించింది. డీజీపీ మహేందర్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా లింక్ ను ఇచ్చారు. ఈ లింక్ లో పొందుపర్చిన అంశాలపై సమాచారం ఇస్తే వారికి పాసులను జారీ చేయనున్నారు. 

 

తమ స్వంత గ్రామం, రాష్ట్రం చేరుకోవాలనుకొనేవారు తెలంగాణ పోలీస్ శాఖ కోరిన సమాచారం ఇవ్వాల్సిందే. ఆ సమాచారం ఇస్తే ఈ పాసులు జారీ చేయనున్నారు.ఇవాళ్టికి 7 వేల పాసులు జారీ చేశారు. మరో 10 వేల పాసులు జారీ చేసేందుకు పోలీసు శాఖ ప్రయత్నాలు చేయనుంది. https:// tsp.koopid.ai./epass అనే లింక్ ద్వారా ఈ పాసుల కోసం ధరఖాస్తు చేసుకోవాలని డీజీపీ సూచించారు. 

ఆయా రాష్ట్రాల్లో నిలిచిపోయిన వలస కూలీలు, విద్యార్థులను స్వంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్రాలకు కూలీలను, విద్యార్థులను రప్పించేందుకు చర్యలు తీసుకొంటున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu
Viral News: అక్క‌డ మందు తాగితే 25 చెప్పు దెబ్బ‌లు, రూ. 5 వేల ఫైన్‌.. వైర‌ల్ అవుతోన్న పోస్ట‌ర్