జూనియర్ పంచాయితీ కార్యదర్శి పోస్టులకు 28న పరీక్ష... దరఖాస్తు గడువు పొడిగింపు

By Arun Kumar PFirst Published 11, Sep 2018, 9:01 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయితీల్లో అభివృద్ది పనులను, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో భారీగా పంచాయతీ కార్యదర్శుల నియామకాలను చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.  ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రతి గ్రామానికి ఓ పంచాయతీ కార్యదర్శిని నియమించాలని స్వయంగా ప్రస్తుత అపద్దర్మ సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే 9 వేల పైచిలుకు జూనియర్ గ్రామ పంచాయతీ ఉద్యోగాల కోసం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. 
 
అయితే ఈ ఉద్యోగాల దరఖాస్తు కోసం ప్రభుత్వం విధించిన గడువు రేపటితో ముగియనుంది. ఫీజు చెల్లింపు గడువు ఈరోజుతోనే ముగుస్తోంది. ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపు, దరఖాస్తు తదితర ప్రక్రియల్లో జాప్యం జరగడంతో చాలా మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేకపోయారు. దీంతో ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దరఖాస్తుకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 

ఆన్ లైన్ లో ఫీజు చెల్లింపును ఈనెల 13 వ తేదీ వరకు, దరఖాస్తును ఈనెల 14వ తేదీ వరకు చేసుకోవచ్చని నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనలతో గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. ఇక ఈ నియామకాల కోసం ఈ నెల 28 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.   
 
Last Updated 19, Sep 2018, 9:23 AM IST