అపోలో ఎండీ కి కరోనా పాజిటివ్.. కాక్ టెయిల్ ట్రీట్మెంట్

Published : Jun 14, 2021, 02:50 PM IST
అపోలో ఎండీ కి కరోనా పాజిటివ్.. కాక్ టెయిల్ ట్రీట్మెంట్

సారాంశం

కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే చాలా షాకింగ్ కి గురైనట్లు ఆమె పేర్కొన్నారు. ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. పాజిటివ్ వచ్చిందని చెప్పారు. 

అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, టాలీవుడ్ హీరో రాంచరణ్ అత్తగారు డాక్టర్ సంగీతా రెడ్డి  ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఈ నెల 10వ తేదీన ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. కాగా.. ఈ మహమ్మారితో యుద్దం చేసేందుకు ఆమె యాంటీ బాడీ కాక్ టైల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే చాలా షాకింగ్ కి గురైనట్లు ఆమె పేర్కొన్నారు. ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. పాజిటివ్ వచ్చిందని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకున్నా.. కరోనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే చాలా మంది నిపుణులు  చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. డాక్టర్ సునీతా రెడ్డి కూడా  వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారినపడ్డారు.

‘జూన్ 10న నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. మొదట షాక్ అయ్యాను. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను.. వ్యాక్సిన్ కూడా తీసుకున్నాను. అయినా నాకు కరోనా ఎలా వచ్చిందా అని షాకయ్యాను. జ్వరం చాలా ఎక్కువగా వచ్చింది. హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. వెంటనే కాక్ టైల్ రీజనరీన్ థెరపీ తీసుకున్నాను. ఈ ట్రీట్మెంట్ తో చాలా మార్పు వచ్చింది. ఈ థెరపీ వల్ల వెంటనే కోలుకోగలిగాను’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

 

మరో ట్వీట్ లో.. ‘ అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే... టీకా కోవిడ్ ని పూర్తిగా నాశనం చేయదు. కానాీ.. లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. సకాలంలో రోగ నిర్థారణ చేయడం.. దానికి వెంటనే చికిత్స తీసుకోవడం వల్లనే నేను త్వరగా కోలుకున్నాను. నాకు వైద్య పర్యవేక్షణలో పోరాడటానికి సహాయకరించిన వైద్య బృందానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ’అని ఆమె చెప్పారు.
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ