అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం: ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న సమస్యలు తేలేనా?

By narsimha lodeFirst Published Sep 28, 2020, 7:16 PM IST
Highlights

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు గాను అక్టోబర్ 6వ తేదీన సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.  నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయమై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి. పరస్పరం రెండు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకొన్నాయి.


హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు గాను అక్టోబర్ 6వ తేదీన సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.  నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయమై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలున్నాయి. పరస్పరం రెండు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకొన్నాయి.

ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే రెండు దఫాలు అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది.

ఆగష్టు 5వ తేదీన తొలుత సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే అదే రోజున ముందుగానే నిర్ణయించుకొన్న కార్యక్రమాలు ఉన్నందున ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి మంత్రికి లేఖ రాసింది. 

also read:కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కి కరోనా: అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా

తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆగష్టు 25వ తేదీకి వాయిదా వేసింది కేంద్రం.అయితే ఆగష్టు 20వ తేదీన కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కి కరోనా సోకింది. దీంతో ఆగష్టు 25వ తేదీన జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది.

అక్టోబర్ 6వ తేదీన ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు కేంద్రం సమాచారం పంపింది.రెండు రాష్ట్రాలు ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను స్పష్టం చేయనున్నాయి.

click me!