గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ

Published : Jan 22, 2021, 11:28 AM IST
గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ

సారాంశం

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం నాడు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు.


అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం నాడు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ హైకోర్టు గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంతో పాటు ఎన్నికల నిర్వహణ అంశాన్ని గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరించనున్నారు.

also read:ఇద్దరు కలెక్టర్ల బదిలీ పంచాయతీ: గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు

దీంతో పాటు చిత్తూరు, గుంటూరు కలెక్టర్లను బదిలీ చేయాలని గత ఏడాది మార్చిలో ఎస్ఈసీ ఆదేశించింది. అయితే ఇంతవరకు ఈ రెండు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేయలేదు. నిన్న జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు ఎస్ఈసీ. అయితే ఈ రెండు జిల్లాల్లో మాత్రం జిల్లా జాయింట్ కలెక్టర్లతో ఎస్ఈసీ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది.

ఈ రెండు జిల్లాల  కలెక్టర్ల బదిలీ వ్యవహారాన్ని కూడ గవర్నర్ దృష్టికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకొనే అవకాశం లేకపోలేదు.

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu