తప్పిపోయిన బాలిక.. 16 ఏళ్ల తర్వాత తల్లి ఒడికి !

By AN TeluguFirst Published Jan 22, 2021, 11:13 AM IST
Highlights

పాతబస్తీలో కర్నూలుకు చెందిన బాలిక తప్పిపోయిన పదహారేళ్లకు ఆపరేష్ స్మైల్ లో భాగంగా ఆమె తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. పాతబస్తీలోని హుస్సేనీ ఆలంలో 16 ఏళ్ల కింద ఓ బాలిక తప్పిపోయింది. అప్పట్లో ఆ బాలికను కొందరు చేరదీసి మియాపూర్‌ అనాథాశ్రమానికి పంపారు. ఈ  బాలిక రాష్ట్ర పోలీసుల సాయంతో తన తల్లిదండ్రుల చెంతకు చేరింది.

ఆపరేషన్‌ స్మైల్‌–7లో భాగంగా అనాథాశ్రమంలోని చిన్నారుల వివరాలపై యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ బృందం పోలీసులు ఆరా తీశారు. హుస్సేనీ ఆలంలో మిస్సైన బాలికను గుర్తించారు. గతంలో బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారు ప్రస్తుతం ఎక్కడున్నారో గాలించారు. 

కర్నూలులో ఉన్న బాలిక తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. గురువారం అనాథాశ్రమానికి వచ్చిన తల్లిదండ్రులు ఆ బాలిక వారి కూతురేనని నిర్ధారించారు. 16 ఏళ్ల తర్వాత తమ కూతురిని తమకు అప్పగించేందుకు కృషి చేసిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

click me!