జీఆర్‌ఎంబీ భేటీ: తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం

By narsimha lodeFirst Published Apr 27, 2022, 5:08 PM IST
Highlights

గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న మూడు ప్రాజెక్టులపై ఏపీ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. మూడు ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను జీఆర్ఎంబీ తోసిపుచ్చింది.

హైదరాబాద్: నగరంలోని జలసౌధలో GRMB బోర్డు సమావేశం బుధవారం జరిగింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ MP Singh అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి  Andhra Pradesh, Telangana  రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు, బోర్డు నిర్వహణ, ప్రాజెక్టుల డీపీఆర్‌లపై సమావేశంలో చర్చ జరుగనుంది. తెలంగాణకు చెందిన చనాకా - కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లపై చర్చించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటనగరం పంప్ హౌస్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల DPRలపై అధికారులు సమావేశంలో చర్చించారు. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రకరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ రావు , ఓఎస్డీ దేశ్ పాండే..  ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఈఎన్సీ నారాయణ రెడ్డి తదితరులు సమావేశానికి హాజరయ్యారు. 

తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవని ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డు దృష్టికి తెచ్చింది. ఈ వాదనను తెలంగాణ తోసి పుచ్చింది.

Godavari నీటిని పట్టిసీమ ద్వారా Krishna బేసిన్ కు ఏపీ తరలించిందని తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ Rajath Kumar ఈ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.ఇందులో తెలంగాణకు 45 టీఎంసీలు రావాలన్నారు. సీలేరు ప్రాజెక్టులో తెలంగాణ వాటాపై కూడా సమావేశం దృష్టికి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలున్నాయన్నారు. ఈ విషయమై డీపీఆర్ లపై చర్చ జరిగిందని కూడా చెప్పారు. ఈ మూడు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను గోదావరి యాజమాన్య బోర్డు చైర్మెన్ తిరస్కరించారని రజత్ కుమార్ చెప్పారు.తెలంగాణ నీటిని ఏపీ వాడుకొంటుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న మూడు ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించామని ఏపీ ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి Shashi Bhushan చెప్పారు. గోదావరి నది జలాల లభ్యతపై అథ్యయం చేయాలని కోరినట్టుగా ఆయన చెప్పారు.గోదావరి జలాలపై ట్రిబ్యునల్ ను కూడా ఏర్పాటు చేయాలని కోరినట్టుగా శశిభూషణ్ చెప్పారు.శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల భద్రతపై పాండ్య కమిటీ రిపోర్టు ఇచ్చిందన్నారు. ఈ విషయమై ఏ రాష్ట్రం ఎంత ఖర్చు పెట్టాలనే దానిపై కూడా స్పస్టత ఇవ్వాలని కోరినట్టుగా  శశిభూషణ్ వివరించారు.

click me!