ముంబై కేంద్రంగా మరో కార్వీ తరహా మోసం: రూ. 1000 కోట్ల చీటింగ్, బాధితుల్లో హైద్రాబాదీలు

Published : Feb 11, 2022, 10:47 AM IST
ముంబై కేంద్రంగా మరో కార్వీ తరహా మోసం: రూ. 1000 కోట్ల చీటింగ్,  బాధితుల్లో హైద్రాబాదీలు

సారాంశం

ముంబై కేంద్రంగా కార్వీ తరహ మోసం వెలుగు చూసింది. సుమారు రూ. 1000 కోట్ల మేర నిందితులను మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. హైద్రాబాద్ వాసులు కూడా మోసానికి గురైనవారిలో ఉన్నారు. 


హైదరాబాద్: Mumbai  కేంద్రంగా Karvy తరహ మోసం ఒకటి వెలుగు చూసింది. ఖాతాదారులను సుమారు రూ. 1000 కోట్లకు నిందితులు మోసం చేశారని పోలీసులు గుర్తించారు. మోసపోయిన వారిలో పలువురు Hyderabad వాసులు కూడా ఉన్నారు.

Customers షేర్లు వాడుకొని తమ ఖాతాల్లోకి  నిధులు మళ్లించుకొన్న Anugrah స్టాక్ బ్రోకింగ్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. ఖాతాదారుల నుండి పవర్ ఆఫ్ అటార్నీ సంతకాలు తీసుకొని ఖాతాను ఖాళీ చేశారని ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి.అనుగ్రహ్ స్టాక్ బ్రోకింగ్ యజమాని పరేష్ ఖరియాను గత ఏడాది Arrestచేశారు. 
  దేశంలోని పలు రాష్ట్రాల్లోని  కస్టమర్లను మోసం చేశారని బాధితులు కేసులు పెట్టారు. తొలుత ఈ సంస్థపై 2020 ఆగష్టు మాసంలో తొలి కేసు నమోదైంది. అయితే ఈ విషయమై ముంబై హైకోర్టులో 500 మంది పెట్టుబడిదారులు పిటిషన్లు దాఖలు చేశారు. 

కార్వీ స్కాం కేసులో  ఆ సంస్థ ఎండీ పార్ధసారథిని అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నిధుల మళ్ళింపు, ఆస్తులపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీపీఎస్ పోలీసులు  ఈడీకి లేఖ రాశారు.కష్టమర్ల షేర్లను తాకట్టు పెట్టి  కార్వీ ఎండీ పార్ధసారధి రుణాలు తీసుకొన్నారని సీసీఎస్ పోలీసులు తెలిపారు.షేర్లను తాకట్టు పెట్టి రూ. 2100 కోట్లను రుణాలు పార్థసారథి  తీసుకొన్నారని గుర్తించారు. 

తీసుకొన్న రుణాన్ని వ్యక్తిగత కంపెనీలకు కార్వీ ఎండి  పార్థసారథి మళ్లించారని గుర్తించారు. రియాల్టితోపాటు ఇన్పోటెక్ కంపెనీలకు నిధులు మళ్లించారని సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు.సుమారు 900 నుండి రూ. 1000 కోట్ల నిధులను కష్టమర్లకు మోసం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్వీ ఎండి చెబుతున్న రెండు కంపెనీల్లో నిధులు లేని విషయాన్ని పోలీసులు గుర్తించారు. మనీ హవాలాతో పాటు మనీ లాండరింగ్  జరిగిందని కూడ సీసీఎస్ పోలీసులు  అనుమానిస్తున్నారు. ఈ విసయ,మై లోతుగా దర్యాప్తు చేయాలని ఈడీని కోరుతూ సీసీఎస్ పోలీసులు  లేఖ రాశారు.

PREV
click me!

Recommended Stories

iBomma Ravi : అసలు ఐబొమ్మ నాది అని చెప్పింది ఎవడు..? ఫస్ట్ టైమ్ నోరువిప్పిన రవి !
Bandi Sanjay About Akhanda 2: బాలకృష్ణలో సీనియర్ ఎన్టీఆర్ ని చూసా: బండి సంజయ్ | Asianet News Telugu