మరో పరువు హత్య: యువకుడ్ని మద్యం తాగించి చంపేశారు

Published : Dec 30, 2018, 09:22 AM ISTUpdated : Dec 30, 2018, 11:14 AM IST
మరో పరువు హత్య: యువకుడ్ని మద్యం తాగించి చంపేశారు

సారాంశం

నాలుగేళ్ళ క్రితం తిరుమలగిరికి చెందిన ఓ యవతిని నందకిషోర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, ఈ వివాహం యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. నందకిశోర్ పెళ్లి చేసుకున్న యువతిది మరో కులం. 

హైదరాబాద్: తెలంగాణలో మరో పరువు హత్య జరిగింది. సికింద్రాబాదులోని తిరుమలగిరిలో ఈ హత్య చోటు చేసుకుంది. నందకిషోర్ అనే యువకుడిని భార్య తరుఫుబంధువులు శనివారం అర్ధరాత్రి దారుణంగా హత్య చేశారు.. 

నాలుగేళ్ళ క్రితం తిరుమలగిరికి చెందిన ఓ యవతిని నందకిషోర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, ఈ వివాహం యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. నందకిశోర్ పెళ్లి చేసుకున్న యువతిది మరో కులం. 

నమ్మించి నందకిషోర్‌ను యువతి ఇంటికి బంధువులు పిలిపించారు. అతనికి మద్యం తాగించారు. ఆ తర్వాత బండరాళ్లతో కొట్టి చంపేశారు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాల వారికి అలర్ట్
Hyderabad పక్కన మరో నయా సిటీ.. 11 జోన్లతో బొమ్మ అద్దిరిపోయేలా ప్లాన్ చేసిన రేవంత్ సర్కార్