
టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్యకు కుట్ర వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రసాద్‌కు సహకరించిన సంతోష్, సుగుణ, సురేందర్, సాగర్‌లను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ బుధవారం మీడియాకు తెలియజేశారు. నిందతుడిని విచారించి కీలక వివరాలను సేకరించామని.. నాంపల్లిలో ఎయిర్ పిస్టల్, మహారాష్ట్రలోని నాందేడ్‌లో కత్తి , బీహార్‌లో నాటు తుపాకీ కొనుగోలు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ప్రసాద్‌ను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
కాగా.. ఆర్మూర్ ఎమ్మెల్యే Jeevan Reddy హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని హైద్రాబాద్ Banjarahills పోలీసులు గత మంగళవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. Armoor నియోజకవర్గంలోని Killeda గ్రామసర్పంచ్ భర్త ఈ ఈ కుట్రకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించిన ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు.
Also Read:ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర: హైద్రాబాద్ లో ఒకరి అరెస్ట్
తన భార్యను సర్పంచ్ పదవి నుండి సస్పెండ్ చేయించడంతో ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్న నిందితుడు జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారని పోలీసులు చెబుతున్నారు. నిందితుడి వద్ద కత్తి, పిస్టల్ ను స్వాధీనం చేసుకొన్నారు. కిల్లెడ గ్రామ సర్పంచ్ గా లావణ్య గతంలో పనిచేసింది. గతంలో కూడా ఎమ్మెల్యేకి ప్రసాద్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారని కూడా ఆయన అనుచరులు గుర్తుచేస్తున్నారు.