అన్నదమ్ముల్ని బద్ధ విరోధులుగా మార్చిన ‘‘ఎకరం’’

Siva Kodati |  
Published : Mar 28, 2021, 07:18 PM IST
అన్నదమ్ముల్ని బద్ధ విరోధులుగా మార్చిన ‘‘ఎకరం’’

సారాంశం

డబ్బు, ఆస్తులు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, తల్లిదండ్రుల మధ్య చిచ్చుపెడుతున్నాయి. చివరికి రక్తసంబంధాన్ని సైతం కాదనుకుని వారిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు కొందరు. తాజాగా ఎకరం పొలం కోసం సోదరుడిపై దాడికి దిగాడో వ్యక్తి.

డబ్బు, ఆస్తులు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, తల్లిదండ్రుల మధ్య చిచ్చుపెడుతున్నాయి. చివరికి రక్తసంబంధాన్ని సైతం కాదనుకుని వారిని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు కొందరు.

తాజాగా ఎకరం పొలం కోసం సోదరుడిపై దాడికి దిగాడో వ్యక్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామచంద్రాపురంలో భూ వివాదం అన్నదమ్ముల మధ్య దాడికి దారి తీసింది. పంట పొలంలో అన్నదమ్ములు, వారి కుటుంబసభ్యులు పరస్పరం దాడి చేసుకున్నారు.

ఏనుగు కృష్ణారెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి అతడి సోదరుడు రామిరెడ్డిపై దాడికి తెగబడ్డాడు. దీంతో రెండు కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!