తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి: మొత్తం 4,35,606కి చేరిక

By narsimha lodeFirst Published Apr 30, 2021, 9:46 AM IST
Highlights

తెలంగాణలో గత 24  గంటల్లో 7,646 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,35,606కి చేరుకొన్నాయి.

హైదరాబాద్: తెలంగాణలో గత 24  గంటల్లో 7,646 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,35,606కి చేరుకొన్నాయి.ఒక్క రోజులో కరోనాతో 53మంది చనిపోయారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 77,727కి చేరుకొన్నాయి.  కరోనాతో మరణాల రేటు 0.51శాతానికి చేరుకొన్నాయి.ఇంకా రాష్ట్రంలో 4,492 మంది పరీక్షలు రావాల్సి ఉంది.

ఆదిలాబాద్ జిల్లాలో 099, కొత్తగూడెంలో 114,జీహెచ్ఎంసీలో141,జగిత్యాలలో 230, జనగామలో 054,భూపాలపల్లిలో055, గద్వాలలో085,,కామారెడ్డిలో 153, కరీంనగర్ లో 274,ఖమ్మంలో 22, ఆసిఫాబాద్ 106, మహబూబ్‌నగర్ లో 243,మహబూబాబాద్ లో 110,మంచిర్యాలలో 191, మెదక్ లో 137,మల్కాజిగిరిలో 631,ములుగులో 036, నాగర్‌కర్నూల్ లో 198, నల్గొండలో285 లో కేసులు నమోదయ్యాయి.

నారాయణపేటలో 087,నిర్మల్ లో 130,నిజామాబాద్ లో 330,పెద్దపల్లిలో 139,సిరిసిల్లలో139, సంగారెడ్డిలో 401,రంగారెడ్డిలో 484, సిద్దిపేటలో 289, సూర్యాపేటలో 283, వికారాబాద్ లో 189, వనపర్తిలో 120,వరంగల్ రూరల్ లో 105,వరంగల్ అర్బన్ 152, భువనగిరిలో 184కేసులు రికార్డయ్యాయి.రాష్ట్రంలో 61.5 శాతం మందికి కరోనా సోకింది. మహిళల్లో 38.5 శాతంగా కేసులు రికార్డయ్యాయి. 

click me!