కొనసాగుతున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్

By telugu teamFirst Published Apr 30, 2021, 8:47 AM IST
Highlights

తెలంగాణలో మినీ మున్సిపల్ ఎన్నికల్లో శుక్రవారం పోలింగ్ ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతోంది. కోవిడ్ నిబంధనల మేరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో శుక్రవారం పోలింగ్ కొనసాగుతోంది. వరంగల్ మహా నగర పాలక సంస్థ, ఖమ్మం నగరపాలక సంస్థలతో పాటు సిద్ధిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 

మొత్తం 11 లక్షల 34 వేల 032 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. కోవిడ్ నిబంధనల మేరకు ఓటు వేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. పోలింంగ్ ఏర్పాట్లను సమీక్షించింది. 

హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఎన్నికల్లో కోవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) సి. పార్థసారథి ఆదేశించారు.  ఎన్నికల విధుల్లో ఉన్నవారు, ఓటర్లు మాస్కులు ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని ఆయన ఆదేశించారు. పోలింగ్ కేంద్రం బయట, లోపల సామాజిక దూరం పాటించాలని సూచించారు. 

కోవిడ్ నియమాల అమలుకు ప్రతి మున్సిపాలిటీలోనూ ఒకరిద్దరు నోడల్ అధికారులను నియించాలని సూచించారు. రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్లలో ఆక్సిజన్ సిలిండగర్లతో అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. 

పోలింగ్ సిబ్బందికి రవాణా సౌకర్యం కల్పించాలని, ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

click me!