
హైదరాబాద్: అమృత మగ బిడ్డకు జన్మనిచ్చిన రోజున అనేక అంశాలు కలిసొచ్చినట్టుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు. పెళ్లి రోజునే అమృత మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
గత నెల 30వ తేదీన హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అమృత మగబిడ్డకు జన్మనిచ్చింది. 2018 జనవరి 30వ తేదీన హైద్రాబాద్ ఆర్యసమాజ్‌లో అమృత, ప్రణయ్ వివాహం చేసుకొన్నారు.
పెళ్లి రోజునే అమృత మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రణయ్ కూడ బుధవారం నాడే పుట్టాడు. ప్రణయ్, అమృతలు పెళ్లి చేసుకొన్న సమయానికే అమృత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇవన్నీ కలిసి రావడంతో ప్రణయ్ మళ్లీ పుట్టాడని ఆ కుటుంబం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
రక్షణ కోసమే హైద్రాబాద్‌లో అమృత డెలీవరీ: ప్రణయ్ తండ్రి
బాబుతో అమృత.. ఫోటో వైరల్
పెళ్లి రోజే డెలీవరీ: మగబిడ్డకు జన్మనిచ్చిన అమృతా ప్రణయ్
పెళ్లి రోజు.. ప్రణయ్ లేకుండానే..అమృత ఎమోషనల్ పోస్ట్