బాబుతో అమృత.. ఫోటో వైరల్

Published : Feb 01, 2019, 03:28 PM IST
బాబుతో అమృత.. ఫోటో వైరల్

సారాంశం

తనకు పుట్టిన బాబుని.. చేతులలోకి తీసుకొని మురిసిపోతోంది అమృత. 

గతేడాది సంచలనం సృష్టించిన సంఘటనల్లో మిర్యాలగూడ పరువు హత్య ఒకటి.  తన కుమార్తె.. వేరే కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు.. ప్రణయ్ ని దారుణంగా నడిరోడ్డుపై హత్య  చేయించాడు. ఆ సమయంలో అమృత ఐదు నెలల గర్భిణి. కాగా.. రెండు రోజుల క్రితం అమృత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

తనకు పుట్టిన బాబుని.. చేతులలోకి తీసుకొని మురిసిపోతోంది అమృత. అమృత, ప్రణయ్ ల పెళ్లి రోజునే బాబు పుట్టడం విశేషం. ఆ చిన్నారి బాబుని అమృత ఎత్తుకున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాబు అచ్చం ప్రణయ్ లాగే ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కామెంట్స్ తో బాబుకి ఆశీర్వాదాలు కూడా అందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?