ఈ నెల 17న హైద్రాబాద్‌కు అమిత్ షా: తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొననున్న కేంద్ర మంత్రి

By narsimha lode  |  First Published Sep 7, 2023, 4:32 PM IST

ఈ నెల  17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైద్రాబాద్ కు రానున్నారు.  తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభలో  ఆయన పాల్గొంటారు.


హైదరాబాద్: ఈ నెల  17న  హైద్రాబాద్ కు  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు.   తెలంగాణ విమోచన దినోత్సవంలో  కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొంటారు.  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే  తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో  అమిత్ షా పాల్గొంటారని బీజేపీ నేతలు  తెలిపారు. గత ఏడాది కూడ  కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని  నిర్వహించారు.  ఈ సందర్భంగా నిర్వహించిన సభలో  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.  అప్పటి నిజాం  రాష్ట్రంలో భాగంగా  ఉన్న రాష్ట్రాల్లో  కూడ  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించిన  విషయం తెలిసిందే.

ఈ దఫా  కూడ  తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ తలపెట్టింది. ఇందులో భాగంగానే  ఈ నెల  17న  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో  ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని  బీజేపీ పట్టుదలతో ఉంది.  ఈ  మేరకు  బీజేపీ  నాయకత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. తెలంగాణ విమోచన దినోత్సవం  సందర్భంగా సభ నిర్వహించిన తర్వాత  రాష్ట్రంలో  బస్సు యాత్ర నిర్వహించాలని  బీజేపీ భావిస్తుంది.  రాష్ట్రంలో మూడు చోట్ల నుండి  బస్సు యాత్రలు  ప్రారంభించాలని ఆ పార్టీ  నిర్ణయం తీసుకుంది.  ఈ యాత్రల ముగింపు  సందర్భంగా  హైద్రాబాద్ లో మరో సభను  కూడ నిర్వహించాలని కూడ ఆ పార్టీ భావిస్తుంది.

Latest Videos

ఈ నెల  17న  కాంగ్రెస్ పార్టీ కూడ  సభ నిర్వహించనుంది.ఈ మేరకు  కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసుకుంది.  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, ఎల్ బీ స్టేడియాల్లో అనుమతుల కోసం కాంగ్రెస్ పార్టీ  ధరఖాస్తు చేసుకుంది.  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో  సభ కోసం  బీజేపీ నేతలు  ధరఖాస్తు చేసుకున్నారు. ఎల్ బీ స్టేడియంలో కూడ  సభ నిర్వహించాలని భావించారు. అయితే  ఎల్ బీ స్టేడియం అనువుగా ఉండదని  కాంగ్రెస్ పార్టీ భావించింది. తుక్కుగూడలో  సభ నిర్వహించాలని ఆ పార్టీ భావించింది. తెలంగాణ విమోచన దినోత్సవం రోజున బీజేపీ, కాంగ్రెస్ పోటా పోటీగా సభలు నిర్వహించనున్నాయి. 

click me!