తెలంగాణలో అమిత్ షా సభ్యత్వం.. ఏంటి మ్యాటర్?

By telugu teamFirst Published Jul 27, 2019, 9:31 AM IST
Highlights

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ అధికారం దక్కించుకోవడమే అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. హైదరాబాద్ లో కానీ లేదా చుట్టుపక్కల జిల్లాల్లో ఆయన సభ్యత్వం తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కాగా... తెలంగాణతో ఎలాంటి సంబంధం లేని ఆయన ఇక్కడ సభ్యత్వం తీసుకోవాలని అనుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ అధికారం దక్కించుకోవడమే అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఇప్పుడు అమిత్ షా కూడా ఇక్కడే సభ్యత్వం తీసుకోనుండటం విశేషం.

బీజేపీ క్రియాశీలక సభ్యత్వం రావాలంటే 20 మందిని అదనంగా పార్టీలో చేర్పించాలి. వీరిని పార్టీ స్థానిక నాయకత్వం అమిత్‌షా వద్దకు తీసుకువెళుతుందా? లేక ఆయనే ఇంటింటికి వెళతారా? అన్నది నిర్ణయం కావాల్సి ఉంది. ఈ అంశంపై బీజేపీ నేతలు తీవ్రంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. .రాష్ట్రంలో అదనంగా 18 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 5 లక్షలు పూర్తయ్యిందనియ పార్టీ నేతలు చెబుతున్నారు. 

click me!