పిల్లి తప్పిపోయిందంటూ పోలీసు కేసు

By telugu teamFirst Published Jul 27, 2019, 9:07 AM IST
Highlights

తిరుమలగిరికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాజేశ్వరి తాను పెంచుకున్న పిల్లుల్లో ఒకటి తప్పిపోయిందని.. దానిని ఎలాగైనా పట్టుకోవాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది.

పిల్లి కనిపించకుండా పోయిందంటూ ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఈ చిత్ర విచిత్ర కేసు విని  పోలీసులు కూడా ఒకింత ఆశ్చర్యపోయారు. తిరుమలగిరికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాజేశ్వరి తాను పెంచుకున్న పిల్లుల్లో ఒకటి తప్పిపోయిందని.. దానిని ఎలాగైనా పట్టుకోవాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఓ వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన పిల్లి బ్లెస్సీ తప్పిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 3లోని శ్రీనికేతన్‌కాలనీలో నివాసం ఉండే వ్యక్తికి ఈ నెల 13న ఫేస్‌బుక్‌ ద్వారా ఓ వ్యక్తిని తాను పెంచుకునే పిల్లిని దత్తత ఇచ్చానని ఆమె చెప్పింది. కాగా ఈ నెల 21న పిల్లికి వ్యాక్సిన్ వేయించాల్సి ఉండగా... దత్తత ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేశానని చెప్పింది. అతను పెద్దగా స్పందించకపోవడంతో... గట్టిగా నిలదీశానని.. దీంతో అతను తన పిల్లి ఇంట్లో నుంచి పారిపోయిందని చెప్పాడని ఆమె చెప్పింది.

జీవహింస చట్టం కింద అతనిపై కేసు నమోదు చేయాలని ఆమె పోలీసులను డిమాండ్ చేశారు. తన పిల్లిని తనకు అప్పగించిన వారికి రూ.10వేలు నగదు బహుమతి కూడా ఇస్తానని ఆమె ప్రకటించింది. ఆమె ఫిర్యాదు ను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్పారు. 

click me!