ఆంధ్రాలో ఏదైనా మార్పు వస్తే అది పవన్ కల్యాణ్ తోనే.. : అల్లుఅర్జున్ మామ

By SumaBala Bukka  |  First Published Feb 24, 2024, 11:19 AM IST

కాంగ్రెస్ లో చేరిన అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి జనసేన నేత పవన్ కల్యాణ్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. 


హైదరాబాద్ : సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనను గాంధీభవన్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దాసు మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత చంద్రశేఖర్ రెడ్డి తో పాటు.. కాంగ్రెస్లో చేరిన నేతలందరూ కలిసి అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిశారు. లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్, మిగతా పార్టీల నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. 

కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నల్గొండ జిల్లా పెద్దాపురం మండలంలో ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. దీనికింద పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కొద్దికాలంగా ఆయన రాజకీయాలలో ఆసక్తి కనబరుస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నాగార్జునసాగర్ నుంచి టికెట్ ఆశించారు. ఈ మేరకు బీఆర్ఎస్ నుంచి  టికెట్ దొరుకుతుందని, తన తరఫున బన్నీ కూడా ప్రచారం చేస్తాడని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ దక్కలేదు.

Latest Videos

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు.. సీజనల్ వ్యాధులతో జాగ్రత్త : వాతావరణ శాఖ హెచ్చరిక

ఆ తరువాతి నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా, కాంగ్రెస్ లో చేరారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలంగాణలో కూడా ఉంది కదా అని ఈ సందర్భంగా ఒకరు ప్రశ్నించగా.. దాని గురించి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. జనసేన పార్టీ తెలంగాణలో అంతగా ఎస్టాబ్లిష్ కాలేదని చెప్పుకొచ్చారు. ఆంధ్రాలో జనసేన 100% ఉందని.. అక్కడ ఏదైనా మార్పు వస్తే అది పవన్ కళ్యాణ్ కారణంగానే వస్తుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం.. టిడిపి, జనసేన కూటమి వల్లే.. అక్కడ ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉందని.. మార్పు గనుక వస్తే ఇప్పుడే రావాలని అన్నారు. కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి  మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

click me!