ఈటలపై ఆరోపణలు, మరోసారి నిజమవుతున్న ఆరోగ్యశాఖ సెంటిమెంటు

By team teluguFirst Published Apr 30, 2021, 11:26 PM IST
Highlights

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ చుట్ట్టూ ఉన్న సెంటిమెంటు మరోసారి నిజమయ్యేలా ఉన్నట్టుగా కనబడుతుంది. తెలంగాణాలో ఇప్పటివరకు ఆరోగ్యశాఖామంత్రి పూర్తి 5 సంవత్సరాలు పనిచేయలేదు. ఇప్పుడు ఈటల విషయంలో కూడా అదే జరిగేలా కనబడుతుంది. 

తెలంగాణ రాజకీయాల్లో నేడు ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ తీవ్రా దుమారాన్ని రేపుతోంది. ఈటల మీద కొన్ని వర్గాల మీడియాలో కథనాలు రావడం, వెనువెంటనే కేసీఆర్ విచారణకు ఆదేశించడం, దానితో ఈఆటలా ప్రెస్ మీట్ పెట్టడం అన్ని వెరసి ఎప్పటినుండో దాల్ మే కుచ్ కాలా హై అనే పుకారు నిజమని తేలిపోయింది. నేటి ప్రెస్ మీట్ లో ఈటల చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. తన మీద జరుగుతున్నవాణ్ణి అసత్య ప్రచారాలు అని అన్నారు. 

తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎన్ని విచారణలకైనా సిద్ధమని సవాల్ విసిరారు మంత్రి ఈటల రాజేందర్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులే స్వచ్ఛందంగా భూముల్ని ప్రభుత్వానికి సరెండర్ చేశారని మంత్రి తెలిపారు. భూములు కోల్పోయినా పర్వాలేదు కానీ ఆత్మను అమ్ముకోనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో ఏ ఇంటి తలుపు తట్టినా తన సాయం వుంటుందని వెల్లడించారు.

నా మొత్తం చరిత్ర మీద ఎంక్వైరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎస్, విజిలెన్స్ విచారణలతో పాటు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ చేయాల్సిందేనని రాజేందర్ కోరారు. నా ఆత్మగౌరవం కంటే పదవి గొప్పది కాదని ఆయన తేల్చిచెప్పారు. నాపై ఆరోపణలు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజేందర్ సవాల్ విసిరారు. ధర్మం తప్పకుండా పనిచేస్తున్నానని.. తాత్కాలికంగా న్యాయం ఓడిపోవచ్చని కానీ అంతిమ విజయం ధర్మానిదేనన్నారు.

భూముల విషయంలో ఈటల నిజంగా అక్రమాలకు పాల్పడి ఉంటే ఆయన శిక్షార్హులే. అందులో ఎటువంటి సంశయం లేదు. ఆయన నిజంగా అక్రమాలకు పాల్పడ్డారా లేదా అనేది విచారణలో తేలుతుంది. ఆ విషయాన్ని పక్కనబెడితే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ చుట్ట్టూ ఉన్న సెంటిమెంటు మరోసారి నిజమయ్యేలా ఉన్నట్టుగా కనబడుతుంది. తెలంగాణాలో ఇప్పటివరకు ఆరోగ్యశాఖామంత్రి పూర్తి 5 సంవత్సరాలు పనిచేయలేదు. ఇప్పుడు ఈటల విషయంలో కూడా అదే జరిగేలా కనబడుతుంది. 

2014లో టి రాజయ్య ఆరోగ్యశాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ... ఆయన సంవత్సరం తిరగకుండానే ఆయన పదవి పోయింది. ఆ తరువాత లక్ష్మ రెడ్డి ఆ పదవిని మిగిలిన కలం చేపట్టారు. ఇక ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా పూర్తి 5 సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగేలా కనబడట్లేదు. ఆయన నేడు రాజీనామా చేయకున్నప్పటికీ... ఆయనకు అధినాయకత్వానికి మధ్య అగాథం అయితే ఏర్పడ్డ విషయం ఇప్పుడు బహిరంగంగా తేలిపోయింది. 

ఈ పరిస్థితుల్లో ఆయన తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. ఆయన పార్టీలో నుండి వెళ్లిపోవాలని నేడు పెట్టిన పొగ వల్ల ఆయన ఇప్పటికిప్పుడు బయటకు వెళ్ళిపోకున్నప్పటికీ... ఇంత అవమానం, ఆయన చేసిన సవాళ్ల తరువాత ఆయన ఎక్కువ కలం ఈ పదవిలో కొనసాగబోరనేది మాత్రం సుస్పష్టం. పదవి తనకు ముఖ్యం కాదని ఆయన చెప్పడం అన్ని చూస్తుంటే ఈదఫా కూడా ఆరోగ్య శాఖను చేపట్టడానికి రెండవ వ్యక్తి వచ్చేలానే కనబడుతున్నాడు. 

click me!