అంత గ్యాప్ అయితే టీఆర్ఎస్ ప్రలోభాలు ఆపలేం: సీఈవోతో ఉత్తమ్ కుమార్ రెడ్డి

By Nagaraju penumalaFirst Published May 17, 2019, 8:36 PM IST
Highlights

ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎంపికకు 40 రోజుల గడువు ఉండొద్దని కోరినట్లు వారంతా తెలిపారు. సమయం ఎక్కువగా ఉంటే అధికార పార్టీ ప్రలోభాలకు పాల్పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

హైదారాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని తెలంగాణ అఖిలపక్ష నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌తో ను కోరారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని అఖిలపక్షం శుక్రవారం సిఈవో రజత్ కుమార్ ను కలిసింది. 

కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీ నేతలు ఆయనతో సమావేశమయ్యారు. ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎంపికపై పలు అభ్యంతరాలను రజత్‌కుమార్‌కు వివరించారు. ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎంపికకు 40 రోజుల గడువు ఉండొద్దని కోరినట్లు వారంతా తెలిపారు. 

సమయం ఎక్కువగా ఉంటే అధికార పార్టీ ప్రలోభాలకు పాల్పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రిజల్ట్స్ వెలువడిన 3 రోజుల్లో ఛైర్మన్ల ఎంపిక జరగాలని, జులై 5 తర్వాత ఛార్జ్‌ తీసుకున్నా ఇబ్బందేమీ ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సీఈవో రజత్ కుమార్ ను కోరినట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 

click me!