2017నాటి యాదాద్రి పరువు హత్య కేసు.. భువనగిరి కోర్ట్ సంచలన తీర్పు

Siva Kodati |  
Published : Jan 18, 2023, 06:54 PM IST
2017నాటి యాదాద్రి పరువు హత్య కేసు.. భువనగిరి కోర్ట్ సంచలన తీర్పు

సారాంశం

2017లో సంచలనం సృష్టించిన నరేష్, స్వాతి పరువు హత్య కేసులో యాదాద్రి భువనగిరి జిల్లా సెషన్స్ కోర్ట్ తీర్పు వెలువరించింది.

2017లో సంచలనం సృష్టించిన నరేష్, స్వాతి పరువు హత్య కేసులో యాదాద్రి భువనగిరి జిల్లా సెషన్స్ కోర్ట్ తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా వున్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, నల్ల సత్తిరెడ్డిలను కోర్ట్ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 9న ప్రాసిక్యూషన్ , డిఫెన్స్ వాదనలు పూర్తయ్యాయి. 2017కు సంబంధించిన ఈ కేసులో 2018 జూలై 31న పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 23 మంది సాక్షుల విచారణతో పాటు భౌతిక ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కోర్ట్ నిందితులను దోషులుగా ప్రకటించింది. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?