
టీవీ9 వాటాల కోనుగోలు కేసులో జరిగే విచారణఖు తాను హాజరు కాలేనని సినీనటుడు శివాజీ తెలిపారు. తన కుమారుడిని అమెరికా పంపే పనుల్లో ఉన్నందున తాను గురువారం విచారణకు హాజరుకాలేనని సైబరాబాద్ పోలీసులకు శివాజీ ఈమెయిల్ చేశారు.
టీవీ9లో వాటాల కొనుగోలు కేసులో అలంద మీడియా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసుల పలుమార్లు నోటీసులు పంపినప్పటికీ శివాజీ హాజరుకాలేదు.
దీంతో పోలీసులు ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో వారం క్రితం శివాజీ అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సైబరాబాద్ పోలీసులు విమానాశ్రయానికి చేరుకుని శివాజీని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.