లండన్‌‌‌లో అక్బరుద్దీన్‌‌కు చికిత్స.. దేవుడిని ప్రార్థించమన్న అసద్

Siva Kodati |  
Published : Jun 09, 2019, 05:11 PM IST
లండన్‌‌‌లో అక్బరుద్దీన్‌‌కు చికిత్స.. దేవుడిని ప్రార్థించమన్న అసద్

సారాంశం

ఎంఐఎం సీనియర్ నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్య కారణాల రీత్యా లండన్‌లో చికిత్స పొందుతున్నారు.

ఎంఐఎం సీనియర్ నేత, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్య కారణాల రీత్యా లండన్‌లో చికిత్స పొందుతున్నారు. 2011 ఏప్రిల్ 30వ తేదీన చాంద్రాయణగుట్ట కేశవగిరిలోని బార్కాస్-బాలాపూర్ రోడ్‌లో హత్యాయత్నం జరిగింది.

ఈ దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడినా.. తీవ్ర గాయాలు పాలవ్వడంతో ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ అస్వస్థతకు గురికావడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను లండన్‌లోని ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు సోదరుడు అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్ధించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ శ్రేణులు, అభిమానులను కోరారు.
 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్