పాతబస్తీ ఎప్పుడు మారుతుంది..? టీఆర్ఎస్ ప్రభుత్వానికి అసదుద్దీన్ ప్రశ్న

By telugu news teamFirst Published Sep 17, 2020, 2:13 PM IST
Highlights

పాతనగరంలోని అద్భుత నిర్మాణా లు దెబ్బతింటున్నాయని, వాటిని పరిరక్షించే చర్యలు మాత్రం లేవన్నారు. ముర్గీ చౌక్‌ సమీపంలో అతిపురాతన భవనం కూలేందుకు సిద్ధంగా ఉన్నా హెరిటేజ్‌ పేరుతో దాన్ని తొలగించటం లేదని, దాన్ని కూల్చి అక్కడ మార్కెట్‌ భవనం నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

హైదరాబాద్ నగరం రోజు రోజుకీ అభివృద్ధి చెందుతోందని.. హైటెక్ సిటీ ప్రాంతం గత 20ఏళ్లలో ఎన్నో మార్పులు చోటుచేసుకొని ఇండియన్ న్యూయార్క్ గా మారిందని మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ పేర్కొన్నారు. కానీ 400 ఏళ్ల చరిత్ర ఉన్నా ఓల్డ్ సిటీ మాత్రం ఇప్పటికీ అలానే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పాతబస్తీపై కూడా ప్రభుత్వం దృష్టి సారిం చాల్సి ఉందని, ఓల్డ్ సిటీకి ఐటీ సెంటర్‌ రావాలని డిమాండ్‌ చేశారు. పలు దఫాలుగా చెప్పినట్టుగా సీఎం హామీల అమలు కోసం తామంతా ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్, ఇతర మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనపై బుధవారం సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. పాతబస్తీ అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.

ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సురేశ్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రం స్పీకర్‌గా ఉండగా, చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టు ప్రారంభమైందని, కానీ ఇప్పటికీ పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాతనగరంలోని అద్భుత నిర్మాణా లు దెబ్బతింటున్నాయని, వాటిని పరిరక్షించే చర్యలు మాత్రం లేవన్నారు. ముర్గీ చౌక్‌ సమీపంలో అతిపురాతన భవనం కూలేందుకు సిద్ధంగా ఉన్నా హెరిటేజ్‌ పేరుతో దాన్ని తొలగించటం లేదని, దాన్ని కూల్చి అక్కడ మార్కెట్‌ భవనం నిర్మించాలని డిమాండ్‌ చేశారు. పాతనగరంలో పార్కింగ్‌ టవర్లను పూర్తి చేయాలని కోరారు.

తన జుట్టు తెల్లపడుతుంది కానీ.. ఓల్డ్ సిటీ మాత్రం మారడం లేదని.. ఈ విషయమై తనను ప్రజలు నిలదీస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌కు మెట్రో వచ్చిందంటే అది తన వల్లేనని, దీన్ని చాలెంజ్‌ చేసి చెప్తానని పేర్కొన్నారు.నా మాటల్లో తప్పుందని తేలితే రాజీనామాకు కూడా సిద్ధమన్నారు.

click me!