సంచలన నిర్ణయం... కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న ఎంఐఎం...అక్కడ మాత్రమే

By Arun Kumar PFirst Published Nov 26, 2018, 4:38 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ తమ మద్దతు టీఆర్ఎస్ పార్టీకే ఉటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మజ్లీస్ అభ్యర్థులు పోటీ చేసే నియోజకర్గాల్లో తప్ప రాష్ట్రంలోని మిగతా అన్నిచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులకే ఆ పార్టీ కార్యకర్తలు, సపోర్టర్లు మద్దతిస్తున్నారు. కానీ ఒక్కచోట మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థిని కాదని కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వడంతో ఆ నియోజకర్గంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలే  మారిపోయాయి.  సదరు నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు అధికంగా ఉండటంతో టీఆర్ఎస్ పార్టీకి ఈ నిర్ణయం తీవ్ర నష్టం చేస్తుందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దులో గల నియోజకవర్గం ముథోల్. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మరోసారి పోటీకి దిగుతుండగా కాంగ్రెస్ (మహాకూటమి) తరపున మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ బరిలోకి దిగారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్  కు మద్దతిస్తున్న ఏఐఎంఐఎం పార్టీ ఈ ఒక్క నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ రావు పటేల్ కు మద్దతివ్వాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు మజ్లీస్ పార్ట జిల్లా అధ్యక్షుడు జబీర్‌ అహ్మద్‌ ఓ ప్రకటన జారీ చేయడం సంచలనంగా మారింది. 

ఈ నియోజకవర్గ పరిధిలోని బైంసా పట్టణంలో జరిగిన మైనారిటీ సమావేశంలో జబీర్ మాట్లాడుతూ...టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రావు గత నాలుగున్నరేళ్లు ఎమ్మెల్యేగా వుండి నియయోజవర్గానికి, మైనారిటీలకు చేసిందేమీ లేదన్నారు. అందువల్లే అతడికి మద్దతివ్వడం లేదని ఆయన తెలిపారు. నిస్వార్థపరుడైన కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ రావు పటేల్ కు మద్దతుగా మజ్లీస్ కార్యకర్తలు పనిచేయాలని జబీర్ పిలుపునిచ్చారు.  
 
click me!