సర్జికల్ స్ట్రైక్స్‌ను ముందే ఊహించా...కానీ ఇప్పుడు కాదు: ఓవైసీ

By Arun Kumar PFirst Published Feb 26, 2019, 7:58 PM IST
Highlights

పుల్వామా ఉగ్రదాడి ద్వారా దొంగచాటుగా దెబ్బతీయడానికి ప్రయత్నించిన పాకిస్ధాన్ కు భారత్ దిమ్మతిరిగే జవాభిచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు ఆ దేశ భూభాగంలోకి చొచ్చుకుపోయి మరీ భారత వాయుసేన ఉగ్రవాద స్థావరాలపై బాంబులతో దాడికి తెగబడింది. ఈ దాడిలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమవగా...ఉగ్రవాదుల స్థావరాలు, క్యాంపులు నేలమట్టమయ్యాయి. ఇలా భారత సైన్యం ఎంతో తెగువను చూపించి చాకచక్యంగా పాక్ ను ఎదుర్కోడాన్ని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభినందించారు. 

అయితే ఈ  సర్జికల్ దాడులను తాను ముందే ఊహించానని ఓవైసి  అన్నారు. కానీ పుల్వామాలో సైనికులపై దాడి జరిగిన రెండు, మూడు రోజుల్లోనే సర్జికల్ స్ట్రైక్  జరుగుతుందని భావించానని...కానీ కాస్త ఆలస్యంగా జరిగిందన్నారు. ఏదైతేనేం చివరకు ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత ఆర్మీ చర్యలు తీసుకోడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ఓవైసి తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ కోసం చేపట్టిన ఈ చర్యలకు మద్దతుగా ఉంటామన్నారు. పాకిస్థాన్ ఎదురుదాడికి దిగితే తిప్పికొట్టడానికి సైన్యం సిద్దంగా వుండాలన్నారు. భారత్ ఈ దాడులను కొనసాగిస్తూ జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల ఉనికే లేకుండా చేయాలని...మసూద్ అజహర్, హఫీజ్ సయిద్‌  వంటి కరుడుగట్టిన ఉగ్రవాదులను ఏరిపారేయాలని ఓవైసి సూచించారు. 
 
click me!