లాడెన్‌పై అమెరికా దాడితో సర్జికల్ స్ట్రైక్స్‌ని పోల్చిన ఉత్తమ్...

By Arun Kumar PFirst Published Feb 26, 2019, 4:15 PM IST
Highlights

భారత వైమానిక దళం పీవోకే, పాకిస్తాన్ భూబాగంలోకి చొచ్చుకుపోయి ఉగ్రవాదులను మట్టుబెట్టడాన్ని మాజీ సైనికాధికారి, టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ అభినందిచారు. పాక్ భూభాగంలోకి వెళ్లి భారత వాయుసేన జరిపిన ఈ దాడిని బిన్ లాడెన్ కోసం అమెరికా చేపట్టిన దాడులతో పోల్చారు. ఇరు దేశాలు కూడా సాహాసోపేతంగా, అత్యంత చతురతతో వ్యవహరించి పాక్ లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులను హతం చేశారని ఉత్తమ్ వెల్లడించారు. 
 
పుల్వామాలో మన సైనికులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు, అందుకు సహకరించిన పాక్ గట్టిగా జవాబిచ్చిన ఇండియన్ ఎయిర్ పోర్స్ కు చెందిన యుద్ద విమానాల పైలట్లకు, ఆర్మీకి సల్యూట్ ఉత్తమ్ సల్యూట్ చేశారు. ఈ దాడులను మరింత ముందుకు తీసుకెళ్లి భారత సైకిక దళాలు జైషే మహ్మద్ హెడ్ క్వాటర్ పై కూడా దాడి చేసి ఆ సంస్థ ఉనికే లేకుండా చేయాలన్నారు. 

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షులు రాహుల్ గాంధీ చెప్పినట్లు దేశ సమగ్రత, సమైక్యత విషయంతో అందరం ఐకమత్యంతో వుంటామని ఉత్తమ్ అన్నారు. దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి రాజకీయాలు వుండవన్నారు. భారత వాయుసేన ఈ సర్జికల్ స్ట్రైక్స్ విజయవంతంగా చేపట్టడం పట్ల అదే విభాగానికి చెందిన ఓ యుద్ద విమాన మాజీ పైలట్‌గా తానెంతో గర్వపడుతున్నట్లు ఉత్తమ్ తెలిపారు. 

click me!