pudding mink pub case: డబ్బున్నోళ్ల పిల్లలను వదిలేశారు.. హైదరాబాద్ పోలీసులపై అసదుద్దీన్ ఆరోపణలు

Siva Kodati |  
Published : Apr 06, 2022, 09:23 PM IST
pudding mink pub case: డబ్బున్నోళ్ల పిల్లలను వదిలేశారు.. హైదరాబాద్ పోలీసులపై అసదుద్దీన్ ఆరోపణలు

సారాంశం

హైదరాబాద్‌లోని పుడింగ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. డబ్బున్న పిల్లలందరినీ వదిలేసి.. పబ్ ఓనర్లనే అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. 

హైదరాబాద్ (hyderabad) బంజారాహిల్స్‌లోని (banjara hills rave party) రాడిసన్ బ్లూ హోటల్‌లో (radisson blu plaza) వున్న పుడింగ్ మింక్ పబ్‌లో (pudding mink pub) జరిగిన రేవ్ పార్టీపై ఎంఐఎం అధినేత (aimim), ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (asaduddin owaisi) స్పందించారు. డబ్బున్న పిల్లలందరినీ వదిలేశారని.. కేవలం పబ్ ఓనర్లనే అరెస్ట్ చేశారని అసదుద్దీన్ ఆరోపించారు. సంపన్న వర్గాలు, పేదలకు ఒకే రకమైన న్యాయం జరగదా అని ఒవైసీ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో హైదరాబాద్ పోలీసులపై అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు వేశారు. అంతేకాదు మంత్రి కేటీఆర్ (ktr) , హైదరాబాద్ సీపీకి (hyderabad police commissioner) ఆయన ట్యాగ్ చేశారు. 

మరోవైపు.. పుడింగ్ అండ్ మింక్ పబ్ డగ్ర్స్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. పబ్‌లో కొకైన సరఫరా చేస్తున్నట్టుగా సమాచారం వచ్చిందని.. దీంతో తెల్లవారుజామున 2 గంటలకు పబ్‌లో సోదాలు నిర్వహించినట్టుగా పేర్కొన్నారు. క్లూస్‌ టీమ్‌కు  కూడా సమాచారం ఇచ్చినట్టుగా చెప్పారు. పబ్‌లోకి వచ్చాక మేనేజర్‌ అనిల్‌కు పోలీసులు సమాచారమిచ్చినట్టుగా పోలీసలు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. పబ్ మేనేజర్ అనిల్ వద్ద ప్లాస్టిక్ ట్రేలో కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పారు. మొత్తం 5 ప్యాకెట్లలో 4.64 గ్రాముల తెల్ల పౌడర్ స్వాధీనం చేసుకున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. 

పబ్‌లో ఉన్న పార్ట్‌నర్ అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పారు. అతడి మొబైల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పేర్కొన్నారు. ఈజీ మనీ కోసమే డ్రగ్స్‌‌ను నిర్వాహకులు సరఫరా చేస్తున్నట్లు  రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఇక, నిందితులపై 1985 NDPS యాక్ట్ U/S 42 (2) కింద కేసు నమోదు చేశారు. 

ఇక, ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో దొరికిన డ్రగ్స్ మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయలో (araku valley) బయటపడినట్టుగా తెలుస్తోంది. అరకు ఏజెన్సీ నుంచి వీటిని తెప్పించినట్లు నార్కోటిక్స్ అనుమానం వ్యక్తం చేస్తోంది. డుంబ్రిగూడ మండలం లోగిలిలో నార్కోటిక్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గంజాయి కేసుల్లో నేరస్తుడైన మహేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పబ్‌లు, పార్టీలకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు. మహేశ్‌ను హైదరాబాద్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది. అయితే స్థానిక పోలీసులు మాత్రం దీనిని ఇంకా ధ్రువీకరించలేదు. 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?