పాకిస్తాన్‌తో ఆడాల్సిన అవసరం ఏముంది?: ఇండియా-పాక్ మ్యాచ్‌పై అసదుద్దీన్ ఒవైసీ

Published : Oct 22, 2022, 04:21 PM IST
పాకిస్తాన్‌తో ఆడాల్సిన అవసరం ఏముంది?: ఇండియా-పాక్ మ్యాచ్‌పై అసదుద్దీన్ ఒవైసీ

సారాంశం

బీసీసీఐ సెక్రెటరీ జై షా చేసిన వ్యాఖ్యలు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లకు సంబంధించి చర్చను లేవదీసింది. రేపు ఆస్ట్రేలియాలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ ఆడటానికి భారత్.. పాకిస్తాన్‌‌కు వెళ్లదు.. సరే.. మరి అదే జట్టుతో ఆస్ట్రేలియాలో ఆడటం ఎందుకు? ఆడకండి అంటూ కామెంట్ చేశారు.  

హైదరాబాద్: బీసీసీఐ సెక్రెటరీ జై షా కామెంట్‌తో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పై చర్చ మొదలైంది. ఆసియా కప్, వరల్డ్ కప్‌ల వరకూ చర్చ వెళ్లింది. ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌లో రేపు ఇండియా, పాకిస్తాన్ జట్టులు క్రికెట్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ తరుణంలో జై షా కామెంట్లు పెద్ద డిబేట్‌ను లేపాయి. తాజాగా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ మ్యాచ్ కోసం పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్లదని జై షా చెప్పిన మాటను పేర్కొంటూ ఆస్ట్రేలియాలోనూ పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడకుండా ఉండాల్సిందని అన్నారు.

ఓ పార్టీ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ‘రేపు మీరు పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతున్నారు? ఆడకుండా ఉండాల్సింది. వద్దు, మనం పాకిస్తాన్‌కు వెళ్లం, కానీ, వారితో ఆస్ట్రేలియాలో ఆడుతాం. అసలు పాకిస్తాన్‌తో ఆడుకుండా ఏమయ్యేది? 2000 కోట్ల నష్టమా? కానీ, భారత ప్రయోజనాల కంటే కూడా ఇది ఎక్కువనా? వదిలిపెట్టండి, రేపు ఆడకండి.’ అంటూ సూటిగా మాట్లాడారు.

ఆసియా కప్‌లో ఆడటానికి భారత్ పాకిస్తాన్‌కు వెళ్లదని బీసీసీఐ సెక్రెటరీ జై షా అన్నారు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచీ సమాధానం వచ్చింది. భారత్‌లో వరల్డ్ కప్‌లో తామూ ఆడబోమని పీసీబీ హెచ్చరించింది.

Also Read: పాక్‌కి రాకున్నా పర్లేదు! కానీ చెప్పే విధానం ఇది కాదు... జై షాపై పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఫైర్...

రేపు జరగబోయే క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ పై భారత్ గెలువాలని కోరుకుంటున్నట్టు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆ మ్యాచ్‌లో మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ మంచి ప్రదర్శన ఇచ్చి పాకిస్తాన్‌ను అణచివేయాలని అన్నారు. అదే సమయంలో ఒక వేళ భారత్ ఓడితే కేవలం ముస్లిం ప్లేయర్లను మాత్రమే వేలెత్తి చూపే కొందరిపైనా విమర్శలు సంధించారు.

భారత్ గెలిస్తే వీరు చాతులు చరుచుకుంటారని, అదే పరాజయం పాలైతే ఎవరి తప్పిదమో అని వెతకడం మొదలెడతారని అన్నారు. ‘ఇది క్రికెట్. మీకు మా హిజాబ్‌తో సమస్య ఉన్నది. మా గడ్డంతో సమస్య ఉన్నది. మా క్రికెట్‌తోనూ సమస్యేనా?’ అని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.