ఇబ్రహీంపట్నంలో భారీగా నగదు పట్టివేత.. రూ. 64.63 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు..

Published : Oct 22, 2022, 04:20 PM ISTUpdated : Oct 22, 2022, 04:22 PM IST
ఇబ్రహీంపట్నంలో భారీగా నగదు పట్టివేత.. రూ. 64.63 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు..

సారాంశం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. ఇబ్రహీంపట్నం-సాగర్ హైవేపై తనిఖీలు చేపట్టిన ఎస్‌వోటీ పోలీసులు.. ఓ కారులో తరలిస్తున్న రూ. 64.63 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. ఇబ్రహీంపట్నం-సాగర్ హైవేపై తనిఖీలు చేపట్టిన ఎస్‌వోటీ పోలీసులు.. ఓ కారులో తరలిస్తున్న రూ. 64.63 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారును పోలీసు స్టేషన్‌కు తరలించారు. కారులో పట్టుబడిన డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఎస్‌వోటీ పోలీసులు పక్కా సమాచారంతోనే.. కారును పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నిక వేళ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. మునుగోడు నియోజకర్గంలోని ప్రధాన రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటి చేసి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు. నల్గొండ జిల్లా వైపు వెళ్లే అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఓ కారులో రూ. 20 లక్షల పట్టుబడ్డాయి. వివరాలు.. తనిఖీల్లో భాగంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఓ కారును చెక్ చేశారు. అందులో దాదాపు రూ. 20 లక్షలను గుర్తించారు. అయితే ఆ నగదుకు సంబందించి అతని వద్ద ఎలాంటి రశీదులు, ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో డబ్బును తరలిస్తున్న అభిషేక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇక, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి కారులో తరలిస్తున్న కోటి రూపాయల నగదును పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. చల్మెడ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీల్లో కరీంనగర్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ భర్త ప్రయాణిస్తున్న కారులో నగదును పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లాలో పోలీసులు ఏర్పాటు చేసిన డైనమిక్ టీమ్స్ తనిఖీల్లో భాగంగా కారులో నగదును గుర్తించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి