కేసీఆర్‌పై అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసలు.. మా సంపూర్ణ మద్దతు

By Mahesh K  |  First Published Oct 16, 2023, 5:04 PM IST

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ రాష్ట్రంలో మంచి పథకాలను తెచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అద్భుతంగా ఉన్నదని వివరించారు.
 


హైదరాబాద్: తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ పై ఎంఐఎం పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసించారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ పై ఆయన పొగడ్తలు కురిపించారు. పేదల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకువచ్చారని వివరించారు. సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టో అద్భుతంగా ఉన్నదని తెలిపారు. కేసీఆర్ తప్పకుండా హ్యాట్రిక్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌కే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

సమైక్య రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండేది. కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తర్వాత రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్(అప్పుడు టీఆర్ఎస్) మెరుగైన ఫలితాలు సాధించింది. కానీ, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయింది. కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. ప్రత్యేక తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తున్నది. గత ఎన్నికల్లోనూ మద్దతు ఇచ్చిన ఎంఐఎం ఇప్పుడు కూడా తమ మద్దతును తెలిపింది. తమ పార్టీ తరఫున బీఆర్ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఉంటుందని తాజాగా ఎంఐఎం పార్టీ స్పష్టం చేసింది.

Latest Videos

Also Read: తెలంగాణ‌ పై స్పష్టమైన విజన్ లేని పార్టీ.. : కాంగ్రెస్ పై మంత్రి కేటీఆర్ ఫైర్

ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఇటు కాంగ్రెస్, అటు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నది. తెలంగాణతోపాటు రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించింది. త్వరలోనే తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

click me!