
హైదరాబాద్: ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవస్థల్ని నాశనంచేశారని ఎఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ విమర్శించారు.బుధవారం నాడు Madhu Yashki హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక Telangana రాష్ట్రం ఏర్పాటు కోసం తాము పార్లమెంట్ లో పోరాటం చేసిన సమయంలో KCR పార్లమెంట్ లో లేడని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. TRS నేతలు ప్రత్యర్ధి పార్టీల నేతలపై అక్రంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. Khammam జిల్లాలో తమ పార్టీకి చెందిన కార్పోరేటర్లు, నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేశారన్నారు. మంత్రి Puvvada Ajay Kumar తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టించారని ఆయన చెప్పారు. అదే విధంగా బీజేపీ కార్యకర్త సాయి గణేష్ Suicide చేసుకొన్న ఘటనపై పోలీసులు మరణ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.