ఆహార శుద్ది పరిశ్రమ ఏర్పాటు:నర్సంపేటలో కేటీఆర్

By narsimha lodeFirst Published Apr 20, 2022, 2:40 PM IST
Highlights

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఆహార శుద్ది పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇవాళ పలు నర్సంపేటలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.


వరంగల్: నర్సంపేటలో ఆహరశుద్ది పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం నాడు తెలంగాణ మంత్రి KTR పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. Narsampet నియోజకవర్గం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. నర్సంపేట మున్సిపాలిటీలో 12 వేల గ్యాస్ సరఫరాను ప్రారంభించామన్నారు.  గతంలో నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ నియోజకవర్గాలకు కేంద్రంగా ఉండేదన్నారు. 

గత టర్మ్ లో నర్సంపేట నుండి పెద్ది సుదర్శన్ రెడ్డి విజయం సాధిస్తే ఈ నియోజకవర్గం రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల కంటే అభివృద్ది పథంలో దూసుకుపోయేదన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే తపన సుదర్శన్ రెడ్డికి ఉందన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటిని అందించిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు.తెలంగాణలో ఒక్కొక్క లక్ష్యాన్ని సాధించుకొంటూ  బంగారు తెలంగాణ వైపునకు ముందుకు వెళ్తున్నామన్నారు. 

 నర్సంపేటలో రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్ది సుదర్శన్ రెడ్డి సాధించుకొన్నారన్నారు. రూ. 670 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులను నిర్మించున్నట్టుగా మంత్రి కేటీఆర్ చెప్పారు.ఈ ప్రాజెక్టుల ద్వారా 60 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుందన్నారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు చివరి భూములకు కూడా నీరు అందుతుందన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవిలో  విద్యుత్ కోతలుండేవన్నారు. తెలంగాణ రాస్ట్రంలో విద్యుత్ కోతలు లేవన్నారు.రైతులకు ఉచితంగా విద్యుత్ ను ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ. 5 వేలు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని ఆయన  చెప్పారు. రూ. 22 వేల కోట్లతో రైతు రుణ మాఫీ చేశామని కేటీఆర్  చెప్పారు.  నర్సంపేట అభివృద్ది కోసం రూ. 50 కోట్లను మంజూరు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. 

కేంద్రంలో అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి పేదల బ్యాంకు ఖాతాల్లో రూ. 10 లక్షలు జమ చేస్తామని మోడీ ఇచ్చారన్నారు. కానీ ఈ హామీని ఇంతవరకు ఏం హమీ చేయలేదన్నారు.  యూపీఏ ప్రభుత్వంలో రూ. 400 గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర మోడీ పాలనలో రూ. 1050కి చేరిందన్నారు.. ప్రతి ఏటా 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని  మోడీ నిలుపుకోలేదని ఆయన విమర్శించారు.

click me!