హైదరాబాదుకే ఎక్కువ నష్టం: రాఫెల్ స్కామ్ పై రాహుల్ ట్విస్ట్

By Arun Kumar PFirst Published Nov 28, 2018, 8:14 PM IST
Highlights

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను పాలించిన ఆనాటి కాంగ్రెస్ , టిడిపి పార్టీలే హైదరాబాద్ ను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాయని ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు.  ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ నగరం కోసం ఎంతో కష్టపడ్డారని రాహుల్ కొనియాడారు. 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను పాలించిన ఆనాటి కాంగ్రెస్ , టిడిపి పార్టీలే హైదరాబాద్ ను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాయని ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు.  ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ నగరం కోసం ఎంతో కష్టపడ్డారని రాహుల్ కొనియాడారు. 

సనత్ నగర్ లో జరిగిన ప్రజా కూటమి సభలో ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీతో పాటు టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ...హైదరాబాద్ మామూలు నగరం కాదన్నారు. ఓ సందర్భంలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ 21 శతాబ్దంలో అమెరికాకు ఫోటీనిచ్చే దేశాలేవైనా ఉన్నాయంటే అవి భారత్, చైనాలేనని  అన్నారని గుర్తు చేశారు.  ఆయన అలా అనడానికి హైదరాబాద్, బెంగళూరులే కారణమని రాహుల్ అన్నారు. 

అలాంటి హైదరాబాద్ మహానగరం ఓ వ్యక్తికి, ఓ కుటంబానికి, ఓ మతానికి చెందినది కాదని...ఈ నగరం అందరిదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి కోసం ఈ నగరం తలుపులుఎప్పుడూ తెలిచి ఉంటాయని రాహుల్ స్పష్టం చేశారు.

ఇక్యమత్యానికి హైదరాబాద్ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. కానీ దేశంలో ఐక్యతను నరేంద్ర మోదీ నాశనం చేస్తున్నారని...ఓ కులానికి మరో కులంతో, ఓ వర్గానికి మరో వర్గంతో , ఓ ప్రాంతానని మరో ప్రాంతంతో చిచ్చులు పెడుతున్నారని రాహుల్ ఆరోపించారు. 

ఎప్పటినుండో అభివృద్ది చెందిన హైదరాబాద్ అభివృద్దికి ప్రస్తుతం ఆటంకం కల్గిందన్నారు. కేసీఆర్ పాలనే హైదరాబాద్ అభివృద్దికి ఆటంకంగా నిలిచిందని రాహుల్ విమర్శించారు. తెలంగాణ ఆదాయాన్ని ఒక్క కుటుంబమే దోచుకుంటుందని రాహుల్ ద్వజమెత్తారు. 

ప్రజాకూటమి నాయకులందరు కలిసి తెలంగాణలో ప్రభుతవం ఏర్పాటు చేయడం ఖాయమని రాహుల్ అన్నారు. తెలంగాణ ప్రజల వాయిసే ఆ ప్రభుత్వ పాలనలో ఉంటుందన్నారు.

రాపేల్ యుద్ద  విమానాల కుంభకోణం వల్ల దేశంలో హైదరాబాద్, బెంగళూరు నగరాలు అధికంగా నష్టపోయాయని రాహుల్ ఆరోపించారు. తాము ప్రాన్స్ తో ఒప్పందం చేసుకున్న సమయంలో విమానాలను ఇక్కడే తయారు చేయాలని కోరినట్లు తెలిపారు. కానీ మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఆ ప్రతిపాదనలు మార్చేశారని...అందువల్ల హైదరాబాద్, బెంగళూరులోని ఇంజనీర్లకు మంచి ఉపాధి అవకాశం మిస్సయ్యందని రాహుల్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు దేశంలోని స్వతంత్ర సంస్థలపై పెత్తనం సాగించలేదన్నారు. కానీ బిజెపి ప్రభుత్వం ఆర్బీఐ, సుప్రీం కోర్టు, ఎలక్షన్ కమీషన్ వంటి వాటిని తమ స్వప్రయోజనాలకు వాడుకుంటుందన్నారు. లోయా హత్యకేసులో తమపై ప్రభుత్వ నుండి ఒత్తిడి ఉందని  స్వయంగా ఓ జడ్జి వెల్లడించాడని ఆరోపించారు. ఇక రాఫెల్ కుంభకోణంపై విచారణ జరుపడానికి సిద్దమైన సిబిఐ డైరెక్టర్ ను రాత్రి 2 గంటలకు తొలగించారని రాహుల్ వ్యాఖ్యానించారు.

 

click me!