మునుగోడులో బోర్డు తిప్పేసిన బీజేపీ.. టీఆర్ఎస్‌లోకి వలసలు.. పార్టీ ఖాళీ అయింది: మంత్రి జగదీశ్ రెడ్డి

By Mahesh KFirst Published Oct 20, 2022, 2:21 PM IST
Highlights

మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి పెద్ద మొత్తంలో నేతలు టీఆర్ఎస్‌లో చేరారు. మునుగోడులో బీజేపీ పార్టీ ఖాళీ అయిందని ఆ నేతలను ఆహ్వానించిన తర్వాత మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపార.
 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక చుట్టూ జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరుగుతున్న ఈ ఉపఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ, పరిధిని విస్తరించడాననికి బీజేపీ, తమ సీటును తిరిగి గెలవాల్సిందేనని కాంగ్రెస్ పార్టీలు తెగ పోటీ పడుతున్నాయి. అన్ని పార్టీలూ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఎదుటి పార్టీల నేతలకు వలలు వేయడం కూడా జరుగుతున్నది. పార్టీ లీడర్లు, క్యాడర్లూ పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో బీజేపీ ఖాళీ అయిందని అన్నారు. బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతలను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలో బూర నర్సయ్య గౌడ్ బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. కానీ, మునుగోడు క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మునుగోడు నియోజకవర్గ బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలు ఆగడం లేదు. తాజాగా పెద్ద మొత్తంలో బీజేపీ నేతలు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 

Also Read: మునుగోడు ఉప ఎన్నిక : బీజేపీ స్టార్ క్యాంపెనర్లలో జీవితా రాజశేఖర్..

గడిచిన 25 ఏళ్లలో బీజేపీలో పని చేస్తున్నప్పటికీ తమ నియోజకవర్గానికి అభివృద్ధి జరిగింది శూన్యమని వారు అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి తమ నియోజకవర్గం మునుగోడులో అన్ని రకాల అభివృద్ధి జరుగుతున్నదని అన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తాము గులాబీ పార్టీలో చేరుతున్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. వీరిని మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడు జడ్పీటీసీ సభ్యులు నారబోయిన రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ వలసలు జరిగినట్టు సమాచారం. గులాబీ కండువా కప్పుకున్న బీజేపీ లీడర్లు ఇలా ఉన్నారు. 

మునుగోడు నియోజకవర్గ బీజేపీ ప్రచార కార్యదర్శి బండారు యాదవయ్య, ఓబీసీ నల్లగొండ జిల్లా జనరల్ సెక్రటరీ మాదగోని నరేందర్ గౌడ్, మైనారిటీ మోర్చా నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎం.డీ మాజీద్, బీజేవైఎం నల్లగొండ జిల్లా సెక్రటరీ పందుల రాజేష్, దళిత మోర్చా మునుగోడు అసెంబ్లీ కన్వినర్ నీరుడు రాజారామ్, బిజెపి మహిళా మోర్చా మునుగోడు మండల అధ్యక్షురాలు  ముచ్చపోతుల స్రవంతి, దళిత మోర్చా అద్యక్షురాలు, నల్లగొండ జిల్లా రాజలక్ష్మి, దళితమోర్చా మండల ప్రధాన కార్యదర్శి జీడిమెట్ల రమేష్‌లు ఉన్నారు.

Also Read: మునుగోడులో త్రిముఖ పోటీ.. 2023 అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయనుందా?

అలాగే చుండూరు మండలం నుంచి.. చండూరు  మాజీ ఎంపీటీసీ సభ్యులు తిరందాసు అనిత  ఆంజనేయులు, బిజెపి ఉపసర్పంచి షేరిగూడెం పంకెర్ల వెంకటేష్, బిజెపి వార్డు మెంబర్ షేరు గూడెం  పంకెర్ల స్వామిలు టీఆర్ఎస్‌లో చేరారు. మర్రిగూడ మండలం, లంకలపల్లి గ్రామం నుండి సర్పంచ్ పాక్ నాగేశ్ ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్‌లో చేరారు. అందులో కాంగ్రెస్ గ్రామశాఖ అద్యక్షుడు  పగిళ్ల రాజశేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు  బోడ భిక్షం, వడ్డెర సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి  వరికుప్పల వేంకటేశం, ముదిరాజ్ సంఘం గ్రామశాఖ అద్యక్షుడు  దాసరి వెంకన్న, గౌడ సంఘం కోశాధికారి  కర్నాటి శ్రీను, దాసరి లింగయ్య , కోటగొని రమేష్, మధి స్వామి, దాసరి కుమార్, వరికుప్పల ప్రసాద్, కొంగల నవీన్, పగిళ్ల హరీష్, జంపాల ఆంజనేయులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శివన్నగూడెం నుండి..  కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మరియు వైస్ ప్రెసిడెంట్ నూనె కొలుపుల పెద్దలు యాదవ్, రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు  శివరాత్రి  ఐలమల్లు, ఎంపీటీసీ సభ్యులు గండికోట హరికృష్ణలు గులాబీ గూటిలో చేరారు. నారాయణ పురం మరియు మర్రిగూడ మండలాల్లోని వడ్డెర సంఘం తరపున 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

click me!