మునుగోడు బైపోల్ 2022:రిటర్నింగ్ అధికారిని మార్చాలని ఈసీ నిర్ణయం

By narsimha lode  |  First Published Oct 20, 2022, 1:01 PM IST

మునుగోడు అసెంబ్లీ  నియోజకవర్గానికి  రిటర్నింగ్ అధికారిని  మార్చాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ముగ్గురు అధికారుల పేర్లను ఈసీకి జిల్లా  అధికారులు పంపారు.


నల్గొండ:మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారిని మార్చాలని ఈసీ నిర్ణయానికి వచ్చింది. ముగ్గురు అధికారుల  పేర్లను  రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి  పంపింది.గుర్తుల కేటాయింపు విషయమై చోటు చేసుకున్నవివాదంపై రిటర్నింగ్ అధికారిని మార్చాలని నిర్ణయం తీసుకుందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ  కథనం  ప్రసారం  చేసింది.

మునుగోడు ఎన్నికలరిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కేంద్ర ఎన్నికల పరిశీలకుడు పంకజ్ కుమార్ గురువారంనాడు విచారణ  నిర్వహించారు .ఈసీ ప్రశ్నలకు తాను సమాధానం  చెప్పినట్టుగా మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్నాథ రావు  మీడియాకు  చెప్పారు.తన విచక్షణ అధికారాలతో అభ్యర్ధులకు గుర్తులను కేటాయించినట్టుగా రిటర్నింగ్ అధికారి  జగన్నాథరావు చెప్పారు.

Latest Videos

రోడ్డు రోలర్ గుర్తు  కేటాయింపు విషయమై  గతంలో  ఉన్న ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్నట్టుగా  చెప్పారు. అయితే తాజాగా  ఈసీఐ ఆదేశాలతో   పాటు రాష్ట్ర  ఎన్నికల ప్రధానాధికారి  నుండి వచ్చిన ఆదేశాల మేరకు శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తును కేటాయించినట్టుగా ఆర్ ఓ  జగన్నాథరావు  ఇవాళ  మీడియాకు వివరించారు.

ఈ నెల  17న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత  అభ్యర్ధులకు గుర్తులను కేటాయించాల్సి  ఉంది. అయితే  ఈ నెల 18న గుర్తులను కేటాయించారు. యుగ తులసి పార్టీ అభ్యర్ధి  శివకుమార్  కి రోడ్డు రోలర్ గుర్తు లాటరీలో  దక్కింది.అయితే  ఈ గుర్తును శివకుమార్ కు కేటాయించలేదు. దీంతో  ఆయన ఈసీకి  ఫిర్యాదు చేశారు.  న్యాయస్థానానికి వెళ్తానని కూడా  చెప్పారు. అంతేకాదు ఆందోళనకు దిగాడు.

also read:టీఆర్ఎస్‌కి షాక్:యుగ తులసి పార్టీ అభ్యర్ధి శివకుమార్ కి రోడ్డు రోలర్ గుర్తు కేటాయింపు

ఇదే గుర్తును కోరుకున్న మరో  పార్టీ  అభ్యర్ధి కూడ ఈసీకి ఫిర్యాదు చేశాడు. దీంతో  ఢిల్లీ నుండి డిప్యూటీ ఎన్నికల  కమిషనర్ హైద్రాబాద్ కు చేరుకున్నారు. ఢిప్యూటీ ఎన్నికల కమిషనర్ కు రోడ్డు  రోలర్ గుర్తు కేటాయింపు విషయమై అభ్యర్ధులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా   శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు ఈ విషయమై  ఇవాళ  సాయంత్రం లోపుగా  వివరణ  ఇవ్వాలని ఎన్నికల  రిటర్నింగ్  అధికారిని ఈసీ ఆదేశించింది.  

కారు గుర్తును పోలిన గుర్తులను ఇండిపెండెంట్లకు కేటాయించవద్దని ఈసీని  టీఆర్ఎస్ కోరింది. ఈ గుర్తుల వల్ల తమ పార్టీ అభ్యర్ధుల విజయావకాశాలు దెబ్బతింటాయని టీఆర్ఎస్ చెబుతుంది. ఇదే విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి  వికాస్  రాజు కి  వినతి  పత్రం  సమర్పించారు. అయితే ఈ విషయమై సరైన స్పందన లేదని హైకోర్టులో  పిటిషన్  దాఖలు చేసింది.ఈ పిటిషన్ ను కోర్టు కోట్టి వేసిన విషయం తెలిసిందే. 

కారు గుర్తును పోలిన రోడ్డురోలర్, కెమెరా, చపాతి రోలర్, డాలీ, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను ఎన్నికల గుర్తుల జాబితా నుండి తొలగించాలని టీఆర్ఎస్  కోరింది.ఇదే  డిమాండ్ తో గతంలో కూడ ఈసీఐకి  కూడా  టీఆర్ఎస్ వినత పత్రం సమర్పించింది. నిన్న కూడ టీఆర్ఎస్ బృందం  ఈసీఐని కలిసి వినతి పత్రం సమర్పించారు.


 

click me!