Aggnipath Protest In Secunderabad : పోలీసుల అదుపులో ఎనిమిది వాట్సాప్ గ్రూప్ ఆడ్మిన్లు

By narsimha lodeFirst Published Jun 22, 2022, 11:58 AM IST
Highlights


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసంలో కీలక పాత్ర పోషించిన ఎనిమిది వాట్సాప్ గ్రూపుల ఆడ్మిన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్ గ్రూపు అడ్మిన్ల వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు


హైదరాబాద్:  Secunderabad Railway Station విధ్వంసంలో  వాట్సాప్ గ్రూపులు కీలకంగా వ్యవహరించాయని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎనిమిది వాట్సాప్ గ్రూపుల  ఆడ్మిన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఒక్క వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ రమేష్ ను పోలీసులు విచారించిని విషయం తెలిసిందే.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో Army ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్ధులు ఈ నెల 17వ తేదీన విధ్వంసానికి పాల్పడ్డారు.ఈ విధ్వంసం వెనుక Whats APP గ్రూపులు కీలక పాత్ర పోషించాయని రైల్వే సిట్ బృందం గుర్తించింది.

రైల్వే స్టేషన్ బ్లాక్, ఇండియన్ ఆర్మీ, హకీంపేట ఆర్మీ సోల్జర్స్, చలో సికింద్రాబాద్ ఏఆర్ఓ3, ఆర్మీ జీడీ 2021 మార్చ్ ర్యాలీ,సీఈఈ సోల్జర్స్  పేరుతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారు.ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా పెద్ద ఎత్తున రెచ్చగొట్టేలా వ్యవహరించారని సిట్ బృందం గుర్తించింది. ఈ వాట్సాప్ గ్రూపుల  ఆడ్మిన్లను Police అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  ఇవాళ ఎనిమిది మంది వాట్సాప్ గ్రూపుల  ఆడ్మిన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు  జిల్లాలోని నర్సరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన  ఆవుల సుబ్బారావును తెలంగాణ కు చెందిన టాస్క్ పోర్స్  పోలీసులు మంగళవారం నాడు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా నుండి నుండి హైద్రాబాద్ కు తీసుకు వచ్చిన తర్వాత  ఆవుల సుబ్బారావును టాస్క్ ఫోర్స్ పోలీసులు రైల్వే పోలీసులకు అప్పగించారు.  

ఆవుల సుబ్బారావు ను  రైల్వే సిట్ బృందం ఇవాళ విచారించనుంది.  మరో వైపు  సికింద్రాబాద్ రైల్వే స్టేసన్ లో విధ్వంసానికి వాట్సాప్ లు  కీలకంగా పనిచేశాయని కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారు.  అయితే సుమారు 10 వాట్సాప్ గ్రూపులను  క్రియేట్ చేసి ఆర్మీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులను రెచ్చగొట్టారని ఇప్పటికే సిట్ బృందం గుర్తించింది. 

ఇదిలా ఉంటే వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్మీ అభ్యర్ధులను రెచ్చగొట్టేందుకు గాను  ఓ ప్రైవేట్ డిఫెన్స్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు అధికారులు గుర్తించారని సమాచారం.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వసంలో పాల్గొన్న వారిలో 56 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇంకా 11 మంది పరారీలో ఉన్నారని రైల్వే ఎస్పీ అనురాధ ఇప్పటికే ప్రకటించారు. మరో వైపు మంగళవారం నాడు మరో 15 మంది అనుమానితులను రైల్వే పోలీసులు ప్రశ్నించారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన వారిపై  జరిపిన కాల్పుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన  దామెర రాకేష్ అనే యువకుడు మరణించాడు. మరో వైపు ఆందోళనలో పాల్గొన్నవారిలో 11 మందికి బుల్లెట్ గాయాలయ్యాయని కూడా రైల్వే పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 

also read:Agneepath Protest In Secunderabad కీలక ఆధారాలు సేకరణ: నేడు ఆవుల సుబ్బారావు విచారణ

ఆర్మీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులను వాట్సాప్ గ్రూపుల ద్వారా రెచ్చగొట్టారని పోలీసులు తెలిపారు.  బీహార్ రాష్ట్రంలో ఇదే తరహాలో విధ్వంసం జరిగిన విషయాన్ని డిఫెన్స్ అకాడమీ ప్రతినిధులు ఆర్మీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులను రెచ్చగొట్టారని రైల్వే ఎస్పీ అనురాధ ప్రకటించిన విషయం తెలిసిందే.
 

click me!