జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు: ఆరుగురు నిందితుల బెయిళ్లపై ,నేడు తీర్పు

By narsimha lode  |  First Published Jun 22, 2022, 11:00 AM IST

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో ఆరుగురు నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్లపై వాదనలు కూడా పూర్తయ్యాయి. నాంపల్లి కోర్టు, జువైనల్ జస్టిస్ బోర్డులు బెయిల్ పిటిషన్లపై తీర్పును ఇవవనున్నాయి.


హైదరాబాద్:Jubilee Hills Gang Rape  ఘటనలోని ఆరుగురు నిందితులు Bail  పిటిషన్లు దాఖలు చేశారు.ఈ కేసులో ఏ1 నిందితుడు Saduddin Malik  నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు మిగిలిన ఐదుగురు మైనర్లు  juvenile justice board లో సీసీఎల్ పిటిషన్లు దాఖలు చేశారు.   కస్టడీ పూర్తైనందును బెయిల్ ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. నిందితులను బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని  పోలీసుల తరపున న్యాయవాది కోర్టులో తమ వాదనలను విన్పించారు. ఇరు వర్గాల వాదనలు ఈ నెల 21న పూర్తయ్యాయి.  ఇవాళ  బెయిల్ పై జువైనల్ బోర్డు, Nampally కోర్టులు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. 

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. తొలుత ఏ 1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ను Custodyలోకి తీసుకున్నారు. ఆ తర్వాత ముగ్గురు Minorను కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఆలస్యంగా అరెస్టైన మరో ఇద్దరు నిందితులకు కూడా జువైనల్ బోర్డు పోలీసుల కస్టడీకి ఇవ్వడంతో వారిని కూడా కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించారు.ఈ నెల 14న ఆరుగురు నిందితుల కస్టడీ పూర్తైంది. దీంతో సాదుద్దీన్ మాలిక్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. మిగిలిన ఐదుగురు మైనర్లను జువైనల్ బోర్డుకు తరలించారు. 

Latest Videos

undefined

ఈ ఏడాది మే 28వ తేదీన Amnesia Pub లో గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత  బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. 

అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే  ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్  తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.

also read:జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు : నిందితుల్లో ‘‘ లైంగిక సామర్ధ్యం ’’.. తేల్చిసిన పోటెన్సీ టెస్ట్ రిపోర్ట్

కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది.  తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.

click me!