మొయినాబాద్ ఫాంహౌస్ కేసు .. సింహయాజీపై అభిమానంతోనే ఫ్లైట్ టికెట్ చేశా : లాయర్ శ్రీనివాస్

By Siva KodatiFirst Published Nov 22, 2022, 9:31 PM IST
Highlights

మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో లాయర్ శ్రీనివాస్ విచారణ ముగిసింది. తాను సింహయాజీపై అభిమానంతోనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసినట్లు వెల్లడించారు. సిట్ అధికారుల దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తానని శ్రీనివాస్ పేర్కొన్నారు. 

మొయినాబాద్ ఫాంహౌస్ కేసును సిట్ వేగంగా విచారిస్తోంది. దీనిలో భాగంగా కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌ను సిట్ అధికారులు సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు సింహయాజీపై వున్న అభిమానంతోనే టికెట్ బుక్ చేసినట్లు తెలిపారు. తనకు బీజేపీతోనూ, ఫాంహౌస్‌ కేసుతోనూ ఎలాంటి సంబంధం లేదని శ్రీనివాస్ వెల్లడించారు. గతంలో పూజలు చేయించుకునేటప్పుడు సింహయాజీతో పరిచయం ఏర్పడినట్లు తెలిపారు. సిట్ అధికారుల దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తానని శ్రీనివాస్ పేర్కొన్నారు. 

ఇకపోతే... మొయినాబాద్  ఫాం హౌస్  కేసులో ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసులో  జగ్గుస్వామికి మంగళవారంనాడు సిట్  లుకౌట్  నోటీసులు జారీ  చేసింది. ఎమ్మెల్యేల  ప్రలోభాల కేసులో  నిన్న సిట్  విచారణకు    జగ్గుస్వామి,  బీఎల్  సంతోష్,  తుషార్ లు    హాజరు కావాల్సి  ఉంది.  ఈ  ముగ్గురు కూడా  విచారణకు  రాలేదు. ఈ  విషయమై  సిట్  అధికారులు న్యాయ సలహ తీసుకోవాలని భావించారు. ఇవాళ  జగ్గుస్వామికి  లుకౌట్ నోటీసులు  జారీ  చేసింది.  అయితే  జగ్గుస్వామితో  పాటు  బీఎల్  సంతోష్  , తుసార్ లకు  కూడా  లుకౌట్   నోటీసులు  జారీ  చేసిందని  మీడియాలో  కథనాలు ప్రసారమయ్యాయి.  

ALso REad:ఆయనకు ఫాంహౌస్‌లు, బ్యాంక్ అకౌంట్లు లేవు... బీఎల్ సంతోష్ జోలికొస్తే : బండి సంజయ్ వార్నింగ్

అయితే  ఈ ప్రచారంలో  వాస్తవం  లేదని  తేలింది. బీఎల్  సంతోష్ , తుసార్ లకు  లుకౌట్  నోటీసులు జారీ  చేశారని  తప్పుడు  వార్తలు  ప్రసారం చేయడంపై  బీజేపీ  నేతలు మండిపడ్డారు. కొందరు  టీఆర్ఎస్  నేతలు  ఈ  విషయమై  సోషల్  మీడియాలో  తప్పుడు  ప్రచారం  చేస్తున్నారని  బీజేపీ నేతలు  మండిపడుతున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ ప్రత్యేక కోర్టు రేపటికి వాయిదా వేసింది.

కాగా.. ఈ  ఏడాది  అక్టోబర్  26న  మొయినాబాద్  ఫాం హౌస్  లో ఎమ్మెల్యేల ను ప్రలోభాలకు  గురిచేస్తున్నారనే  ఆరోపణలతో  రామచంద్రభారతి,  సింహయాజీ,  నందకుమార్ లను పోలీసులు  అరెస్ట్ చేశారు. తాండూరు  ఎమ్మెల్యే  పైలెట్  రోహిత్ రెడ్డి  ఫిర్యాదు  మేరకు  ఈ  ముగ్గురిని  పోలీసులు అరెస్ట్ చేశారు.   

click me!