ఆదిలాబాద్‌లో రెండు మృతదేహల కలకలం: పోలీసుల దర్యాప్తు

Published : Apr 30, 2023, 04:17 PM ISTUpdated : Apr 30, 2023, 04:37 PM IST
ఆదిలాబాద్‌లో  రెండు మృతదేహల కలకలం: పోలీసుల దర్యాప్తు

సారాంశం

ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా గుడిహత్నూర్ మండలం గర్కంపేటలో  మృతదేహలు కలకలం రేపుతున్నాయి.   

ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా గుడిహత్నూర్  మండలం గర్కంపేటలో రెండు మృతదేహలు కలకలం సృష్టించాయి. . ఎక్కడో హత్య  చేసి  మృతదేహలను ఇక్కడ తీసుకొచ్చారనే  అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   సంఘటన స్థలాన్ని  ఎస్పీ  ఉదయ్  కుమార్ రెడ్డి  పరిశీలించారు.. 

మృతులను  ఆదిలాబాద్ కు  చెందిన  ఆశ్విని, రెహమాన్ గా గుర్తించారు.  రెండు మృతదేహలపై  తలలపై  గాయాలను పోలీసులు గుర్తించారు.  ఈ హత్యలు  రెండు రోజుల క్రితం  జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

 ఆశ్వనికి  వివాహమైంది.  వీరిద్దరి హత్యకు  గల కారణాలపై  పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం  కారణమా  అనే కోణంలో   పోలీసులు ఆరా తీస్తున్నారు. రెహమాన్   ఈ  నెల  28వ తేదీ నుండి కన్పించడం లేదని  కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు  చేశారు.  కానీ ఇవాళ  రెహమాన్  మృతదేహం లభ్యమైంది.  వీరిద్దరిని  ఎవరు  హత్య చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆశ్వని, రెహమాన్ లను  హత్య చేయడానికి  గల కారణాలపై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?