ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ను ముట్ట‌డించిన రైతులు.. ఉద్రిక్తత..

By AN TeluguFirst Published Dec 19, 2020, 1:34 PM IST
Highlights

అదిలాబాద్ రైతులు హైద‌రాబాద్‌లోని ప్రగతి భవన్‌ను ముట్టించారు. ఆదిలాబాద్ బీజేపీ నేత‌ల ఆధ్వ‌ర్యంలో జరిగిన ముట్టడిలో సెక్యూరిటీని దాటుకుని ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

అదిలాబాద్ రైతులు హైద‌రాబాద్‌లోని ప్రగతి భవన్‌ను ముట్టించారు. ఆదిలాబాద్ బీజేపీ నేత‌ల ఆధ్వ‌ర్యంలో జరిగిన ముట్టడిలో సెక్యూరిటీని దాటుకుని ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకంలో రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారం వాటా కింద రెండేళ్లుగా నిధులు విడుదల చేయలేదు. దీంతో అదిలాబాద్ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆదిలాబాద్ బీజేపీ నేత‌ల ఆధ్వ‌ర్యంలో ఈ ముట్ట‌డి నిర్వ‌హించారు.

సెక్యూరిటీని దాటుకొని ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోకి దూసుకెళ్లేందుకు య‌త్నించారు. అయితే, దీంతో ప్ర‌గ‌తిభ‌వ‌న్ ఎదుట కాసేపు ఉద్రిక్త‌త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.. రైతులు, పోలీసుల మ‌ధ్య వాగ్వాదం, తోపులాట‌కు దారితీయ‌గా.. వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు పోలీసులు. 

click me!