ఆజాద్ ఎన్‌కౌంటర్‌... తుది తీర్పు వెలువరించిన కోర్ట్, ఆ 29 మంది పోలీసులపై విచారణకు ఆదేశం

By Siva KodatiFirst Published Dec 13, 2022, 6:33 PM IST
Highlights

మావోయిస్ట్ అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్‌కౌంటర్ కేసులో ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. నాటి ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మంది పోలీసులపై విచారణ ప్రారంభించాలని కోర్ట్ ఆదేశించింది. 

మావోయిస్ట్ అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్‌కౌంటర్ కేసులో ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానం తుదితీర్పును వెలువరించింది. ఈ కేసులో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మంది పోలీసులపై మూడు నెలల్లో విచారణ ప్రారంభించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీత ఆదేశించారు. 2010లో సర్కేపల్లిలో ఆజాద్ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆయనతో పాటు జర్నలిస్ట్ హేమచంద్ర పాండే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. అది బూటకపు ఎన్‌కౌంటర్ అని, వారిద్దరినీ సజీవంగా పట్టుకుని చిత్రహింసలు పెట్టారని, అనంతరం వారిని బూటకపు ఎన్‌కౌంటర్‌ల చంపారంటూ ఆజాద్ భార్య పద్మ ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. ఆమెకు మద్ధతుగా పౌర హక్కుల సంఘాలు కూడా ఆందోళనలు నిర్వహించాయి. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మంది పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

click me!